సీఎం కేసీఆర్ మహిళా బంధుగా నిలిచిపోతారు : మంత్రులు సత్యవతి, సబిత
హైదరాకబాద్ : మహిళల స్వావలంబన, సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా బంధుగా నిలిచిపోతారని మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం రవీంద్ర భారతిలో రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహిళా కమిషనర్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల కార్యదర్శి దివ్య దేవరాజన్, మహిళా కమిషన్ సభ్యులు, వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన మహిళలు పాల్గొన్నారు.
ప్రతి రోజు మహిళా రోజే : మంత్రి సత్యవతి రాథోడ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్క రోజే మహిళల రోజు కాదు.. ప్రతి రోజు మహిళా రోజే అని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహిళ కుటుంబంలో, సమాజంలో అన్ని రకాలుగా వివిధ స్థాయిల్లో తన పాత్ర పోషిస్తుందన్నారు. గత ప్రభుత్వాల్లో మహిళలు అనుకున్న పురోగతి సాధించలేదు అని గుర్తించిన సీఎం కేసీఆర్ మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళల రక్షణ, పోషణ కోసం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే వారి అభివృద్ధి సాధ్యం అని నమ్మి ఆరోగ్య లక్ష్మి, భరోసా కేంద్రాలు, షి టీమ్స్ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల నుంచే ముందు ఆడపిల్ల గురించి ఆలోచనల్లో మార్పు రావాలన్నారు. మహిళల అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. మహిళా కమిషన్ సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు బాగా పని చేస్తోంది. ఇందుకు వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. వారికి తోడుగా మనమంతా కలిసి పని చేయాలి. ఎనిమిది మంది వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఈ సందర్భంగా సత్కరిస్తున్నందుకు, సన్మాన గ్రహీతలకు మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు తెలిపారు.

మహిళల భద్రత కోసం పెద్ద పీట : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. అమ్మాయిలకు శుభాశీస్సులు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సమాజంలో సగ భాగం మహిళలు అని వారి కోసం ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రతి విద్యార్థి వారి అమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి. అమ్మ,అమ్మమ్మకు మించిన రోల్ మోడల్ సమాజంలో ఇంకెవరు ఉండరని ఆమె అన్నారు. మహిళలు అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు అని సీఎం కేసీఆర్ నమ్మి అనేక అవకాశాలు కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. మహిళల భద్రత కోసం పెద్ద పీట వేశారు. దేశంలో మొదటి సారి ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల కోసం 53 డిగ్రీ గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకుని మహిళలు ముందుకు వెళ్లాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

మహిళలను సమానంగా చూడాలి : సునీతా లక్ష్మారెడ్డి
మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అంటే వంటింటికి పరిమితం అనే అభిప్రాయం ఉండేది. కానీ అందరికీ సమాన అవకాశాలు కావాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ మహిళా దినోత్సవం అని ఆమె పేర్కొన్నారు. మహిళలు సాధించిన విజయాలు, సాధించాల్సిన లక్ష్యాల గురించి ఈ దినోత్సవం జరుపుకుంటామని గుర్తు చేశారు. సమాజం అభివృద్ధి జరగాలంటే మహిళలు, పురుషులు సమానంగా ఉండాలి. మహిళలకు సీఎం కేసీఆర్ అన్ని రకాల అవకాశాలు కల్పిస్తున్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సునీతా లక్ష్మారెడ్డి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

