కృష్ణా జలాల్లో 50 శాతం వాటాకు తెలంగాణ డిమాండ్
Krishna River | సోమాజిగూడలోని జలసౌధ కార్యాలయంలో మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం అయింది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ,

హైదరాబాద్ : సోమాజిగూడలోని జలసౌధ కార్యాలయంలో మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం అయింది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించనున్నారు. ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంతో పాటు ఉప సంఘం నివేదికపై కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించనున్నారు.
ఈ సమావేశానికి హాజరయ్యే కంటే ముందు తెలంగాణ సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోరుతున్నాం. ప్రాజెక్టుల నిర్వహణ ఎలా చేస్తారని అడుగుతున్నాం? ఇవాళ్టి సమావేశం తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. బోర్డు పరిధిలోకి ఏ ప్రాజెక్టులు ఇవ్వాలనేది చర్చిస్తామన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు వాటా పెరగాలి. నదీ పరివాహక ప్రాంతం తెలంగాణలో అధికంగా ఉంది. నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించాలి. వాటా ప్రకారం తెలంగాణకు 570 టీఎంసీలు కేటాయించాలి. కొత్త ట్రిబ్యునల్ వచ్చే వరకు మరో 105 టీఎంసీలు ఇవ్వాలన్నారు. బోర్డు పరిధిలో విద్యుత్ ప్రాజెక్టులూ ఉండాలని కోరుతున్నారు. తెలంగాణలో అనేక ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఈ క్రమంలో నీటి వాటాతో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఎత్తిపోతల పథకాలు, బోరుబావులకు విద్యుత్ ఉత్పత్తి చేయాలి అని రజత్ కుమార్ డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
సింగరేణి సమస్యలపై కేటీఆర్‌తో ఎంపీ రవిచంద్ర చర్చ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

