ఆదర్శ గ్రామాల్లో తెలంగాణ పల్లెలు
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై)లో మన పల్లెలు సత్తా చాటుతున్నాయి. దేశంలోని ఆదర్శ గ్రామాల్లో మన గ్రామాలే గత కొంతకాలంగా మొదటి పది స్థానాల్లో నిలుస్తున్నాయి. టాప్‌లోని 20 గ్రామాల్లో తెలంగాణకు చెందినవే 15 ఉండటం గమనార్హం. రాష్ర్టానికి చెందిన పార్లమెంట్ సభ్యులు దత్తత తీసుకున్న
దేశంలో టాప్ 10లో అన్నీ మనవే
టాప్ 20లో 15 గ్రామాలు మనవే
కొంతకాలంగా చెదరని ర్యాంకులు
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై)లో మన పల్లెలు సత్తా చాటుతున్నాయి. దేశంలోని ఆదర్శ గ్రామాల్లో మన గ్రామాలే గత కొంతకాలంగా మొదటి పది స్థానాల్లో నిలుస్తున్నాయి. టాప్‌లోని 20 గ్రామాల్లో తెలంగాణకు చెందినవే 15 ఉండటం గమనార్హం. రాష్ర్టానికి చెందిన పార్లమెంట్ సభ్యులు దత్తత తీసుకున్న గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం స్థానికంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నది. పల్లె ప్రగతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల వల్లనే మ్రన గ్రామాలు దేశంలో టాప్‌లో నిలుస్తున్నాయి.
ఎస్ఏజీవై పథకంలో పేర్కొన్న కార్యక్రమాలు సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, డంపింగ్ షెడ్లు, ట్రాక్టర్, విద్యుత్తు సమస్యల పరిష్కారం, నర్సరీ, మొక్కల పెంప కం, ఇంకుడు గుంతలు, పారిశుద్ధ్యం వంటివి పల్లెప్రగతి ద్వారా అమలవుతున్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ మెరుగ్గా ఉందని చెప్పుకొనే కేరళకు చెందిన గ్రామాలు తెలంగాణకు దరిదాపుల్లో కూడా లేవు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని పల్లెలు ఎక్కడా తెలంగాణకు సమీపంలో కూడా లేవు. దీంతో మొదటి పది ర్యాంకులు మనవే ఉన్నాయి. తెలంగాణ గ్రామ పంచాయతీలు ఇతర విషయాల్లోనూ ముందునిలిచాయి. ఈ – పంచాయతీ, ఈ -ఆడిట్, బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్ ప్లస్) గ్రామాలు, రూర్బన్ క్లస్టర్లు వంటి అనేక అంశాల్లో తెలంగాణ ముందుంది. పంచాయతీలకు ప్రతి నెలా నిధులు విడుదల చేయడం, ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకొని గ్రామాలను అద్దంలా తీర్చిదిద్దుతున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- best
- India
- list
- Rural areas
RELATED ARTICLES
తాజా వార్తలు
Russia-Ukraine | రష్యా-ఉక్రెయిన్ చర్చల్లో పురోగతి.. యుద్ధ ఖైదీల అప్పగింతపై పరస్పర అంగీకారం..!
రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక
‘రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలి’
KTR | బీజేపీతో నిర్మల్‌లో ఒక్క పనైనా అయ్యిందా..? : కేటీఆర్
KA Paul | విజయసాయిరెడ్డి కొత్త పార్టీపై కేఏ పాల్ ధ్వజం..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

