VC Ravinder Gupta | తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా అరెస్ట్
VC Ravinder Gupta | హైదరాబాద్ : నిజామబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) వైస్ చాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తా (VC Ravinder Gupta)ను ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో దాదాపు 8 గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం రవీందర్ గుప్తాను అరెస్టు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు.
VC Ravinder Gupta | హైదరాబాద్ : నిజామబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) వైస్ చాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తా (VC Ravinder Gupta)ను ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో దాదాపు 8 గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం రవీందర్ గుప్తాను అరెస్టు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. రవీందర్ గుప్తాను ఏసీబీ అధికారులు ఆస్పత్రికి తరలించారు. మరికాసేపట్లో ప్రత్యేక ఏసీబీ కోర్టులో రవీందర్ గుప్తాను అధికారులు హాజరు పరచనున్నారు.
నిజామాబాద్ జిల్లా పరిధిలోని భీమ్గల్లో పరీక్షా కేంద్రం (Exam Centre) ఏర్పాటుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు వీసీ రవీందర్ గుప్తా రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. హైదరాబాద్లోని తార్నాకలో (Tarnaka) ఉన్న తన నివాసంలో లంచం (Bribe) తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్లో (Bheemgal) పరీక్షా కేంద్రం ఏర్పాటుకు రవీందర్ గుప్తా లంచండ డిమాండ్ చేశారు. దీంతో ఆయన అడిగిన మొత్తాన్ని నిర్వహాకులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
గతకొన్ని రోజులుగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. వర్సిటీ రిజిస్ట్రార్ నియామకం విషయంలో పాలకమండలితో వీసీకి తలపడిన విషయం తెలిసిందే. అయితే వర్సిటీలో పరిస్థితులు రోజురోజుకూ ప్రతికూలంగా మారుతుండటంతో వీసీ వెనక్కి తగ్గారు. రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ యాదగిరిని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. అయితే తాజాగా వీసీ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడటం గమనార్హం. వీసీ ఏసీబీ అధికారులకు పట్టుబడిన తర్వాత విద్యార్థులు తెలంగాణ యూనివర్సిటీలో సంబురాలు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

