ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో మనమే టాప్
పెట్టుబడుల ఆకర్షణలో శరవేగంగా దూసుకుపోతున్న తెలంగాణ.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల ఏర్పాటుకు పారిశ్రామికవాడల (క్లస్టర్ల)ను అభివృద్ధి చేయడంలోనూ సత్తా చాటుతున్నది. ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (సీడీపీ) కింద రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో
19 క్లస్టర్ల అభివృద్ధితో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ
మన తర్వాత పంజాబ్, మధ్యప్రదేశ్, యూపీ, తమిళనాడు
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): పెట్టుబడుల ఆకర్షణలో శరవేగంగా దూసుకుపోతున్న తెలంగాణ.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల ఏర్పాటుకు పారిశ్రామికవాడల (క్లస్టర్ల)ను అభివృద్ధి చేయడంలోనూ సత్తా చాటుతున్నది. ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (సీడీపీ) కింద రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 19 ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్ (18), మధ్యప్రదేశ్ (11), ఉత్తరప్రదేశ్ (10), తమిళనాడు (9) ఉన్నాయి. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే గత ఐదేండ్లలో మన రాష్ట్రంలోనే అత్యధికంగా పారిశ్రామికవాడల అభివృద్ధి జరుగుతుండటం గమనార్హం. జిల్లాలవారీగా లభ్యమయ్యే ముడి సరుకులు, వాటితో తయారయ్యే ఉత్పత్తులకు పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరాకీని బట్టి దేశవ్యాప్తంగా సీడీపీని అమలు చేస్తున్నారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటు కోసం 50 ఎకరాలు లేదా అంతకన్నా తక్కువ భూమిలో ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ఎంఎస్ఎంఈ క్లస్టర్లు
- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫైబర్ గ్లాస్ క్లస్టర్. మాదారంలో అగ్రి-ఫుడ్ ప్రాసెసింగ్, ఫైబర్ గ్లాస్ క్లస్టర్.
- మెదక్ జిల్లా దుద్దెడలో జనరల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పార్కు. బూచనెల్లిలో ఆటో యాన్సిలరీ క్లస్టర్.
- మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో లెదర్ డిజైన్ క్లస్టర్.
- ఖమ్మం జిల్లా బుగ్గపాడులో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్.
- వరంగల్ జిల్లా మడికొండలో ఆభరణాల క్లస్టర్.
- పెద్దపల్లి జిల్లా మంథనిలో అగ్రి ఇంప్లిమెంట్స్ క్లస్టర్.
- నల్లగొండలో ఫర్నిచర్ సిటీ.
- నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో స్పైస్, ఆగ్రో, సీడ్ ప్రాసెసింగ్ క్లస్టర్.
- వీటితోపాటు యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- cluster
- msme
- nationwide
- state
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

