Beauty Pageant | మన హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ పోటీలు..! తరలిరానున్న వివిధ దేశాల అందాల భామలు..!
Beauty Pageants | ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే ప్రపంచ అందాల పోటీలకు తెలంగాణ వేదిక కానున్నది. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నది.
Beauty Pageant | ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే ప్రపంచ అందాల పోటీలకు తెలంగాణ వేదిక కానున్నది. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నది. దాదాపు నాలుగు వారాల పాటు జరిగే ఈ పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలతో పాటు గ్రాండ్ ఫినాలేను సైతం హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారు. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ ఫెస్టివల్లో 120కిపైగా దేశాలు పాల్గొంటాయి. బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే థీమ్‌తో ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనుండగా.. దేశ విదేశాల ప్రతినిధులకు తెలంగాణ స్వాగతం పలుకబోతున్నది.
మే 7 నుంచి ఈ అందాల పోటీలు జరగనున్నాయి. మే 31న గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారు. గతంలో న్యూఢిల్లీ, ముంబయి నగరాల్లో ఈ అందాల పోటీలు జరిగాయి. 71వ ఎడిషన్ ముంబయిలో నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలున్న హైదరాబాద్ ఇప్పటికే పలు అంతర్జాతీయ వేడుకలకు వేదికైంది. తెలంగాణను పర్యాటకంగా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాయి. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో టూరిజం శాఖ దేశ విదేశీ పర్యాటకులను ఇప్పటికే ఆహ్వానిస్తుంది. గొప్ప చేనేత వారసత్వం.. అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు.. అరుదైన వంటకాలు.. విభిన్నమైన కళా వారత్వం ఉన్న తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను స్వాగతిస్తున్నామని.. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shraddha Kapoor | శ్రద్ధా కపూర్ ట్రెడిషనల్ లుక్.. పసుపు చీరలో మెరిసిపోయిన బాలీవుడ్ బ్యూటీ
Jabardasth | జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజుకు రోడ్డు ప్రమాదం.. భీమవరం సమీపంలో ఘటన!
Errabelli Dayakar Rao | ఈ పరిపాలన ఇక రాదు.. రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి : ఎర్రబెల్లి దయాకర్ రావు
Sitarama Project | సీతారామ కాలువ పనులను అడ్డుకున్న కమలాపురం రైతులు
Anupama Parameswaran | మహేష్ బాబు సినిమాలో విలన్‌గా నటించడానికైనా రెడీ.. అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

