హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే క్రీడా హబ్‌గా మరబోతుందదని క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భోపాల్‌లో 25.11.2021 నుంచి 10.12.2021 వరకు జరిగిన 64వ జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్లో హైదరాబాద్‌కు చెందిన (SATS) చెందిన క్రీడాకారిణి రాపోలు సురభి భరద్వాజ్ 50 మీటర్స్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే భారత షూటింగ్ జట్టు ప్రాబబుల్స్ కు ఎంపికైంది. ఈ మేరకు మంత్రి ఆమెను అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATS) చెందిన షూటింగ్ రేంజ్లో సురభి భరద్వాజ్ గత 5 సంవత్సరాలుగా షూటింగ్ ప్రాక్టీసు చేస్తుందన్నారు. 50 మీటర్స్ విభాగంలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ షూటింగ్లో రాణిస్తున్న సురభి భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందించబోతున్నామన్నారు.