TS Weather Update | నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి వానలు
TS Weather Update | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) తెలిపింది.
TS Weather Update | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) తెలిపింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలోని కామారెడ్డిలో అత్యధికంగా 74.8 మి.మీ, హైదరాబాద్‌లో అత్యధికంగా తిరుమలగిరిలో 57.3 మి.మీ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. దేశంలోని పలు రాష్ర్టాల్లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని కేంద్ర వాతావరణశాఖ ప్రకటించింది.
వాయవ్య భారతంలో రేపట్నుంచి భారీ వానలు
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం బంగ్లాదేశ్ తీరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు కేంద్ర వాతావరణశాఖ ప్రకటించింది. ఇది గంటకు 25 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్నదని తెలిపింది. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు వాయవ్య భారతంలో వానలు పడే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. మహారాష్ట్ర, కొంకణ్ తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. మరోవైపు పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో మంగళవారం నుంచి ఐదురోజులపాటు భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం ఈ ప్రాంతాల్లో సాధారణంగానే ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | డిసెంబర్లో అమెరికాకు మెగాస్టార్ చిరంజీవి.. ‘కాకా’ పాట విడుదల సందర్భంగా యూఎస్ టూర్!
RC 17 | రామ్ చరణ్‌తో సుకుమార్ మరో ప్రయోగం.. రంగస్థలం తర్వాత ఊహించని సబ్జెక్ట్‌తో మెగా పవర్ స్టార్!
Manipur: మణిపూర్‌లో వర్గపోరు.. ముగ్గురు నాగా మిలిటెంట్లు హతం
Khammam | ఖమ్మంలో తీవ్ర విషాదం.. మత్స్యకారుల ప్రాణాలు కాపాడి వరదలో కొట్టుకుపోయిన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది !
Ramayana | తెలుగు రాష్ట్రాల్లో ‘రామాయణ’ బిజినెస్ రూ.54 కోట్లు.. బ్రేక్ ఈవెన్ రూ.100 కోట్ల గ్రాస్ ,ఇది సాధ్యమేనా?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

