హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని బడులకు వేసవి సెలవులొచ్చేశాయి. మంగళవారం బడులకు ఆఖరు పనిదినం కాగా, బుధవారం నుంచి వేసవి సెలవులిచ్చారు. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు బడులకు సెలవులుగా పాటించనుండగా, జూన్ 12న పాఠశాలలు తిరిగి పునఃప్రారంభమవుతాయి.
జూన్ 12 నుంచే నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానున్నది. మొత్తం 49 రోజుల పాటు బడులకు వేసవి సెలవులు అమల్లో ఉంటాయి.