2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల.. సెలవులు ఇవే..
హైదరాబాద్ : 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బుధవారం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు మొత్తం 230 పని దినాలు ఉంటాయని ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 24వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. సమ్మర్ వెకేషన్ ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు ఉండనుంది.
మొదటి ఎఫ్ఏ( formative assessment )జులై 21 లోపు, ఎఫ్ఏ-2 పరీక్షలు సెప్టెంబర్ 5 లోపు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ సూచించింది. ఇక ఎస్ఏ-1( summative assessment ) పరీక్షలు నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఎఫ్ఏ-3 ఎగ్జామ్స్ డిసెంబర్ 21 లోపు, ఎఫ్ఏ -4 పరీక్షలను పదో తరగతి విద్యార్థులకు జనవరి 31 లోపు, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 28 లోపు నిర్వహించనున్నారు. 1 నుంచి 9 తరగతులకు ఎస్ఏ-2 పరీక్షలను ఏప్రిల్ 10 నుంచి 17 వరకు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఫిబ్రవరి 28 లోపు టెన్త్ స్టూడెంట్స్‌కు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ బోర్డు ఎగ్జామ్స్ మార్చి నెలలో నిర్వహించనున్నట్లు తెలిపింది.
పండుగల సెలవులు ఇవే..
దసరా సెలవులు – అక్టోబర్ 26 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు(14 రోజులు)
క్రిస్మస్ సెలవులు – డిసెంబర్ 22 నుంచి 28 వరకు(7 రోజులు)
సంక్రాంతి సెలవులు – జనవరి 13 నుంచి 17 వరకు(5 రోజులు)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

