ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?
తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల ఫలితాలను కొన్నిచోట్ల తారుమారు చేసేందుకు లేబర్ కమిషన్ అధికారులు కుట్రలకు పాల్పడ్డారని ఆర్టీసీ కార్మిక నేతలు పెత్త ఎత్తున ఆరోపిస్తున్నారు.
- అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారి?
- కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
- క్లాజ్-6లోని నాలుగు రీజియన్లపై ఆరోపణలు
- లేబర్ ఆఫీస్ ఎదుట జేఏసీ నేతల ఆందోళన
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల ఫలితాలను కొన్నిచోట్ల తారుమారు చేసేందుకు లేబర్ కమిషన్ అధికారులు కుట్రలకు పాల్పడ్డారని ఆర్టీసీ కార్మిక నేతలు పెత్త ఎత్తున ఆరోపిస్తున్నారు. ఫలితాల విడుదలలో జాప్యంచేసిన అధికారులు.. పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. క్లాజ్-6లోని నాలుగు రీజియన్లలో స్థానిక గుర్తింపు సంఘాన్ని ఖరారు చేసే విషయంలో అవకతవకలు జరిగాయని తెలిపారు.
ఈ ఫలితాలను తారుమారు చేయడంలో లేబర్ కమిషన్కు చెందిన ఓ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారని తెలిసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరుపై ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆ అధికారి అధికార పార్టీకి తొత్తుగా మారి ఫలితాలను తారుమారు చేయడాన్ని నిరసిస్తూ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఈదురు వెంకన్న, తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు థామస్రెడ్డి, ఇతర నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. కార్మిక శాఖ అధికారుల తీరుకు నిరసనగా నిరసనలకు వారు పిలుపునిచ్చారు.
తొలి నుంచి కార్మిక శాఖ అడ్డంకులు: జేఏసీ
ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో తొలి నుంచి కార్మిక శాఖ తీవ్ర వివక్షకు పాల్పడుతూ, అడ్డంకులు సృష్టిస్తున్నదని ఆర్టీసీ జేఏసీ కూటమి నేతలు ఒక ప్రకటనలో ఆరోపించారు. ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ, ఎన్ఎంయూ జేఏసీ కూటమి ఘనవిజయం సాధించినప్పటికీ, ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయడంలో కార్మిక శాఖ చేస్తున్న జాప్యాన్ని తీవ్రంగా ఖండించింది.
ఎన్నికల గుర్తుల కేటాయింపు విషయంలోనూ గతంలో టీఎంయూకు ఉన్న బాణం గుర్తును తొలగించి నిచ్చెన గుర్తును కేటాయించడం సహా, పలు నిర్ణయాలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. కార్మికుల ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని, పారదర్శకతను పాటించి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని తక్షణమే జారీ చేయాలని డిమాండ్ చేసింది. ఈ విషయంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట్స్వామి జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

