రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తొలిసారి విద్యుత్తు లోటు.. రాష్ట్ర చరిత్రలో 3 రోజులు తీవ్ర కొరత.. డిమాండ్ 328 మిలియన్ యూనిట్లు కాగా సరఫరా 322 మి.యూ.. గరిష్ఠంగా పగలు 19, రాత్రి 9 గిగావాట్లకు సరఫరా పరిమితి విధింపు.. చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్.. ఉత్పత్తి, కొనుగోలు లేక ఉక్కిరిబిక్కిరి.. రాష్ట్ర చరిత్రలో 3రోజులు షార్టేజ్
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): మిగులు విద్యుత్తు దిశగా సాగుతున్న తెలంగాణ.. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ అపసవ్య విధానాలతో విద్యుత్తు లోటుకు చేరింది. కాం గ్రెస్ హయాంలోనే రాష్ట్రంలో తొలిసారి ఈ విద్యుత్తులోటు ఏర్పడింది. ఈ నెల 8 నుంచి 10 వరకు వరుసగా మూడురోజులపాటు కొనసాగడం ఆందోళన కలిగిస్తున్నది. శనివారం రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలు 328.23 మిలియన్ యూనిట్లు ఉండగా, సరఫరా మాత్రం 322.07 మిలియన్ యూనిట్లకే పరిమితమైంది. ఈ ఒకరోజే 6.16 మిలియన్ యూనిట్ల విద్యుత్తు లోటు ఏర్పడింది. అంటే రాష్ట్ర అవసరాలకు తగిన విద్యుత్తును రాష్ట్రం అందించలేకపోయింది. సెప్టెంబర్ 29న సైతం లోటు ఏర్పడింది. మొత్తంగా విద్యుత్తు సరఫరా విషయంలో సర్కార్ చేతులెత్తేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అధికారిక సమాచారం మేరకు రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలు 336 మిలియన్ యూనిట్లుగా ఉన్నది. ఇప్పటివరకు గరిష్ఠంగా సరఫరా చేసిన విద్యుత్తు కేవలం 324 మిలియన్ యూనిట్లు మాత్రమే. అంటే 12 మిలియన్ యూనిట్ల కొరత ఉన్నది. అంటే 336 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించలేకపోతున్నది. ప్రభుత్వం అనుసరించిన విధానాలే ఇప్పుడు అవసరాలకు సరిపడా సరఫరా చేయలేని పరిస్థితికి చేరాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్తు రంగాన్ని కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని, విద్యుత్తులోటు ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సోలార్ ఉన్నప్పుడే సాగుకు సరఫరా
రాష్ట్రంలో సోలార్ విద్యుత్తు లభ్యమైనప్పుడే సాగుకు విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. సోలార్ విద్యుత్తు ఉత్పత్తి లేనప్పుడు వ్యవసాయానికి సరఫరా చేయడమే లేదు. అందుకే పగటిపూటే వ్యవసాయానికి విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. సోలార్ అందుబాటులో లేకపోతే వ్యవసాయానికి కరెంట్ ఇచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. ఇచ్చేది కూడా అంతరాయం లేకుండా ఇవ్వడంలేదు. ఫీడర్‌ను బట్టి కోతలు విధిస్తున్నారు. మధ్యలో గంట గంటన్నరపాటు తరచూ కోతలు విధిస్తున్నారు. పరిశ్రమలకు పగటిపూట విద్యుత్తును బంద్ చేశారు. రాత్రిపూట మాత్రమే ఇస్తున్నారు.
ఉత్పత్తి చేయరు.. కొనుగోలు చేయరు!
విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచడం లేదు, బయట మార్కెట్లో కొనడమూ లేదని విస్మయం వ్యక్తమవుతున్నది. కొరత ఏర్పడినప్పుడు బయటి నుంచి కొనాల్సి ఉండగా అది కూడా చేయడంలేదు. దీంతో లోటు ఏర్పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని జెన్కోకు చెందిన పవర్ జనరేషన్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి క్రమంగా తగ్గుతున్నది. ఇలాంటి క్లిష్ట సమయంలో పలు యూనిట్లు షట్‌డౌన్ అవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గత కొద్దిరోజులుగా విద్యుత్తు ఉత్పత్తి ఆశించిన స్థాయిలో ఉండటమే లేదు. శుక్రవారం జెన్కో ప్లాంట్లల్లో 114 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి కాగా, శనివారానికి 101 మిలియన్ యూనిట్లకు పడిపోయింది.
కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ – భూపాలపల్లి) 500 మోగావాట్ల యూనిట్-1 షట్‌డౌన్ అయింది. ఈ ప్లాంట్‌లో 23 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి కావాల్సి ఉండగా, శనివారం 16 మిలియన్ యూనిట్లకే పరిమితమైంది. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లోని 800 మోగావాట్ల సామర్థ్యం గల యూనిట్-1 నడవడమే లేదు. ఈ ప్లాంట్‌లో శుక్రవారం 35 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయితే శనివారానికి 28 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. భదాద్రి థర్మల్ ప్లాంట్‌లో యూనిట్-3 సెప్టెంబర్ 9 నుంచి బంద్ అయింది. శ్రీశైలంలోని రెండు హైడల్ ప్లాంట్లల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఇదే ప్లాంట్‌లోని 150 మోగావాట్ల యూనిట్-4 కూడా నడవడంలేదు.
డిమాండ్ పెరుగకుండా నియంత్రణ
విద్యుత్తు డిమాండ్ పెరుగుదలను విద్యుత్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా నియంత్రిస్తున్నాయి. పెరుగుతున్న వినియోగాన్ని కావాలనే కట్టడి చేస్తున్నాయి. పగటిపూట 19 గిగావాట్లు, రాత్రిపూట 9 గిగావాట్లకు నియంత్రించారు. అంతకు మించి విద్యుత్తు సరఫరా చేయరాదని ఏకంగా షరతులే విధించాయి. అంతకు మించి వినియోగం పెరిగితే కోతలు అమలు చేస్తున్నారు. అయినా డిమాండ్ పెరిగితే వ్యవసాయ విద్యుత్తుపైనే మొదట వేటు వేస్తున్నారు. సాగుకు ఎడాపెడా కోతలు అమలు చేస్తున్నారు. పరిశ్రమలకు సాయంత్రం వేళల్లో కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నారు. లోడ్ రిలీఫ్ పేరిట అధికారికంగానే కోతలు అమలు చేస్తున్నట్టు పారిశ్రామికవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. నియంత్రించకపోతే పీక్ డిమాండ్, వినియోగం మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. మొత్తంగా రాష్ర్టానికి అవసరమైన విద్యుత్తును సరఫరా చేయలేక సర్కార్ చేతులెత్తేసిందని విద్యుత్తురంగ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
లోటు ఎప్పుడెప్పుడంటే? (మిలియన్ యూనిట్లలో)

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
కమ్యూనిటీల్లో నీటి కటకట
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

