మరోసారి ధాన్యం వేలం.. 16.93 లక్షల టన్నుల వేలానికి నిర్ణయం
మరోసారి ధాన్యం విక్రయించేందుకు పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. యాసంగికి సంబంధించిన 16.93 లక్షల టన్నుల ధాన్యం వేలం వేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : మరోసారి ధాన్యం విక్రయించేందుకు పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. యాసంగికి సంబంధించిన 16.93 లక్షల టన్నుల ధాన్యం వేలం వేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. కనీస ధరను టన్నుకు రూ. 23,890గా నిర్ణయించింది. మొత్తం 290 లాట్స్‌లో ధాన్యాన్ని వేలం వేయనున్నది. ఈ నెల 29వ తేదీన వేలం ప్రక్రియను నిర్వహించనున్నది.
అయితే ఇప్పటికే రబీ ధాన్యం వేలం వేయగా బిడ్డర్ల నుంచి స్పందన రాకపోవడంతో గత టెండర్‌ను రద్దు చేసింది. గత నెల 11.72 లక్షల టన్నులు వేలం వేయగా కేవలం 63 వేల టన్నులు మాత్రమే అమ్ముడుపోయాయి. మిగిలిన ధాన్యం కొనుగోలుకు వ్యాపారులు, మిల్లర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేసి ఇప్పుడు మరోసారి టెండర్ వేయాలని నిర్ణయించింది. ఇప్పుడైనా వ్యాపారులు ముందుకొస్తారా లేదా అనేది ప్రశ్నగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

