ఉద్యోగినుల్లో మనం మేటి
ఉద్యోగాల కల్పనలో మహిళలకు సముచిత గౌరవం కల్పించే రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే సమున్నత స్థానంలో నిలిచింది. మహిళ ఉపాధిలో టాప్-5 రాష్ర్టాల్లో చోటు దక్కించుకొన్నది.
- స్త్రీలకు ఉపాధి కల్పనలో తెలంగాణకు మూడోస్థానం
- జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో వెల్లడి
- దేశంలో పురుష ఉద్యోగులు మూడురెట్లు ఎక్కువ
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల కల్పనలో మహిళలకు సముచిత గౌరవం కల్పించే రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే సమున్నత స్థానంలో నిలిచింది. మహిళ ఉపాధిలో టాప్-5 రాష్ర్టాల్లో చోటు దక్కించుకొన్నది. అత్యధిక మహిళా ఉద్యోగినులున్న రాష్ర్టాల్లో మేఘాలయ, మణిపూర్ తరువాత తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్) తాజాగా విడుదల చేసిన ఐదో ఎడిషన్ ఈ విషయాన్ని వెల్లడించింది.
మహిళ సాధికారత కోసం కృషి చేస్తూ ఆర్థిక వృద్ధిలో మహిళలను భాగస్వాములు చేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ర్టాల్లో స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నట్టు సర్వే పేర్కొన్నది. ఎన్ఎఫ్హెచ్ ఎడిషన్-4 సర్వేతో పోలిస్తే మహిళ ఉద్యోగాల్లో మహిళల వాటా ఏ మాత్రం పెరగలేదు. అప్పుడు 24 శాతం ఉంటే ఇప్పుడూ అదే 25 శాతమే ఉన్నది. దేశంలో పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంలో 11 రాష్ర్టాలు మాత్రమే మెరుగైన స్థితిలో ఉన్నాయి.
దేశంలో మహిళా ఉద్యోగుల కంటే మూడు రెట్లు ఎక్కువగా పురుష ఉద్యోగులు ఉన్నారు. ఈ సర్వే ప్రకారం భారత్లో 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న పురుషుల్లో 75 శాతం మంది ఉద్యోగులు ఉండగా, స్త్రీలలో 25 శాతం మాత్రమే ఉన్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తక్కువ చదువుకున్న వారికి ఉపాధి లభ్యత ఎక్కువగా ఉన్నది. ఐదో తరగతి కంటే తక్కువ చదువుకున్న పురుషుల్లో 89 శాతం, మహిళలలో 34 శాతం ఉపాధి కలిగి ఉన్నారు. అసలే చదువుకోని పురుషులు 87 శాతం, మహిళలు 34 శాతం ఉపాధి కలిగి ఉండటం గమనార్హం.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Job creation
- Telangana
- womens
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

