హైదరాబాద్: తెలంగాణ పాలిసెట్-2023 (TS POLYCET) ఫలితాలు (Results) మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ (Navin mittal) ఫలితాలను రిలీజ్ చేస్తారు. ఈ నెల 17న నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు 98,273 (92.94 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 54,700 మంది బాలురు, 43,573 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 1,05,742 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇందులో అర్హత సాధించినవారికి ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్, టెక్నాలజీ సంబంధిత డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ యూనివర్సీటీల్లో అందుబాటులో ఉన్న అగ్రికల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు.