డ్రగ్స్ దందాలో సంపాదించిన ఆస్తుల జప్తు!
మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు.
- నార్సింగి కొకైన్ ముఠా ఆర్థిక మూలాలపై దెబ్బ
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నారొటిక్స్ పోలీసులు, ఈగల్ బృందం సంయుక్తంగా కొకైన్ అక్రమ రవాణా కేసు లో సుమారు రూ.2 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను గుర్తించి, మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కొకైన్ అక్రమ రవాణా వ్యవహారంలో 2025లో శ్రీరామ్ అనంత్‌కుమార్, పేరూరు వీరబాబును నిందితులుగా గుర్తించారు.
వారి నుంచి 107.4 గ్రాముల కొకైన్‌తోపాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారి వెనుక ఉన్న నెట్వర్, ఆర్థిక లావాదేవీలు, కూడబెట్టిన ఆస్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ దర్యాప్తులో శ్రీరామ్ అనంత్‌కుమార్, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన రెండు బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.43,655 ఉన్నట్లు గుర్తించి ఆ మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. నిందితుడి బంధువుల పేర్లపై ఉన్న రెండు నివాస ఫ్లాట్లను గుర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రగ్స్ దందాలో సంపాదించిన ఆస్తుల జప్తు!
ఇంద్-భారత్ రుణాల్లో రూ.2 వేల కోట్ల స్కామ్.. ఈడీ, సీబీఐకి మాజీ ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్ ఫిర్యాదు
ఫ్యాకల్టీని ఇష్టారీతిన తొలగించొద్దు : ఉన్నత విద్యామండలి
ఆన్లైన్లో ప్రైవేట్ టీచర్లు, పిల్లల హాజరు మానిటరింగ్
తల్లిదండ్రుల వాట్సాప్‌నకు ఎస్ఏ-1 ప్రోగ్రెస్కార్డు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

