KCR | శిలాక్షరం కేసీఆర్.. తెలంగాణ పదం ఉన్నంతకాలం కేసీఆర్ చరిత్రను చెరపలేరు
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్న కార్యక్రమాల వీడియోలు, తెలంగాణ సీఎంవో, రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ యూట్యూబ్ చానల్స్‌లో ప్రత్యక్ష ప్రచారం చేసిన వీడియోలను తొలగించడం వివాదస్పదమవుతున్నది.
- చెరిపేస్తే చెరగని సంతకం
- అధికారిక చానళ్లలోని వీడియోల తొలగింపుపై తెలంగాణప్రజల ఫైర్
KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్న కార్యక్రమాల వీడియోలు, తెలంగాణ సీఎంవో, రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ యూట్యూబ్ చానల్స్‌లో ప్రత్యక్ష ప్రచారం చేసిన వీడియోలను తొలగించడం వివాదస్పదమవుతున్నది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన ఆయా వీడియోలను తొలగిండంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ‘తెలంగాణ శిలాక్షరం కేసీఆర్. తెలంగాణ పదం ఉన్నంతకాలం ఆ పేరు చిరస్థాయిగా ఉంటుంది. అది చెరగని సంతకం. అధికారిక యూట్యూబ్ చానల్, తెలంగాణ సీఎంవో, సమాచార పౌరసంబంధాల శాఖ ప్రసారం చేసే చానల్స్‌లో కేసీఆర్ వీడియోలను తొలగించినంత మాత్రాన ప్రజల హృదయాల నుంచి ఆయన ముద్రను ఎవరూ తొలగించలేరు’. ఇది తెలంగాణవాదులు ఘంటాపథంగా చెప్తున్న మాట. ‘పార్టీలు, ప్రభుత్వాలు, నాయకులు, అధికారులు, సలహాదారులు మారినంత మాత్రాన చరిత్ర చెరిగిపోదు. ‘పచ్చబొట్టు చెరిగిపోదులే’ అన్నట్టు కేసీఆర్‌ను తెలంగాణ సమాజమే కాదు యావత్‌దేశం మరిచిపోదు’ అని వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు తాము నడిచివచ్చిన దారిని విస్మరించి, ఆ దారి వేసినవారిని నిత్యం తూలనాడటం ద్వారా తామే చరిత్ర నిర్మాతలం అన్నట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినినిపిస్తున్నాయి.
ఇంతకీ ఏం జరిగింది?
రాష్ట్రంలో గడచిన రెండున్నర నెలలుగా మార్పుల ప్రహసనం కొనసాగుతున్నది. ప్రగతిభవన్ పేరు మార్చి ప్రజాభవన్‌గా నామకరణం చేయడం, అక్కడి శిలాఫలకంతోపాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రాం గణంలోని శిలాఫలకంపై ‘ముఖ్యమంత్రి కేసీఆర్’ అన్న పేరును చెరిపివేసినప్పటి నుంచి మార్పుల ప్రహసనం మొదలైంది. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ‘కొత్తసంబురం’, ఆకతాయితనంతో చేసిన చర్యగా కొంతమంది భావించినా అదే పాలనారీతిగా కొనసాగుతున్నదని తాజా పరిణామం స్పష్టం చేస్తున్నది. తాజాగా తెలంగాణ సీఎంవో, రాష్ట్ర పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో కొనసాగే యూట్యూబ్ చానెల్లోనూ గత ఆనవాళ్లను తొలగించడం వివాదస్పదంగా మారింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా సగటు తెలంగాణ పౌరులు ఆగ్రహం, విస్మయం వ్యక్తంచేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇంకా పీసీసీ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నారని, సీఎంగా తనను తాను భావించుకోవడం లేదని బీఆర్ఎస్ సోషల్ మీడి యా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్న కార్యక్రమాల వీడియోలు, తెలంగాణ సీఎంవో, రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ యూట్యూబ్ చానల్స్‌లో ప్రత్యక్ష ప్రచారం చేసిన వీడియోలను తొలగించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వ అధికారిక చానల్ అన్నప్పుడు ప్రభుత్వ పెద్దలుగా పనిచేసినవారి కార్యక్రమాల వీడియోలు అన్నీ అందులో ఉంటాయని, కానీ వాటిని తొలగించి రేవంత్‌రెడ్డి నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తెలంగాణ అణవణువు, గుండెగుండెలో గూడుకట్టుకున్న అభిమానం కేసీఆర్’ అన్న కనీస స్పృహను రేవంత్‌రెడ్డి సర్కార్ ఉంచుకుంటే మంచిదని హిత వు పలికారు. కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాద నే సత్యాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
అసెంబ్లీ సాక్షిగా..
సీఎం రేవంత్‌రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడిలా కాకుండా రాష్ర్టాన్ని నడిపించే సారధిగా అత్యంత బాధ్యతాయుతమైన పాత్రపోషించాల్సిందిపో యి తనస్థాయిని తానే తగ్గించుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీలోనే చర్చసాగుతున్నది. ‘రాష్ట్రం లో కేసీఆర్ ఆనవాళ్లేలేకుండా చేస్తాను’ అని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడా న్ని తెలంగాణవాదులు ఉదహరిస్తున్నారు.
చెరిపేస్తే చెరిగేదా కేసీఆర్ చరిత్ర!
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోతుందా? అని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడి యా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో ప్ర శ్నించారు. రేవంత్‌రెడ్డి సీఎంలా కాకుండా ఇం కా పీసీసీ అధ్యక్షుడిలాగే వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక యూట్యూబ్ చానళ్లలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. సీఎం హోదాలో కేసీఆర్ పాల్గొ న్న కార్యక్రమాల వీడియోలను తెలంగాణ సీ ఎంవో, రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ యూట్యూబ్ చానళ్లలో వాటిని అప్లోడ్ చేసి ప్రత్యక్ష ప్రచారం చేసేవారని తెలిపారు.
రేవంత్‌రెడ్డి సీఎం కాగానే పాత వీడియోలన్నింటినీ యూట్యూబ్ నుంచి తొలగించి నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను తప్ప మరెవరూ కనిపించొద్దనే దురుద్దేశంతో కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వ జమెత్తారు. తెలంగాణ సాధించి, పదేండ్లలో రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో ఉంచి దేశానికే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ వీడియోలు, ప్రసంగా లు ప్రజలకు అందుబాటులో ఉండొద్దనే కుట్రతోనే వాటిని తొలగించారని దుయ్యబట్టారు. దుర్బుద్ధితో వాటిని తొలగించినంత మాత్రాన కేసీఆర్ పేరును ప్రజల్లో లేకుండా చేయాలనుకోవడం అవివేకమే అవుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదనే సత్యాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

