చుట్టూ పచ్చని పొలాలు.. మధ్యలో వంకలు తిరిగిన మంజీర నది. సూర్యుడిని కమ్మేసిన మబ్బుతునక.. చినుకు రాలితే ఒడిసిపట్టుకుందామా అన్నట్టు చూస్తున్న జలదోసిలి. అది సంధ్యాసమయపు మేఘ మంజీరం. హెలికాప్టర్ నుంచి తీసిన ఈ దృశ్యాన్ని సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ మంగళవారం ట్విట్టర్లో పంచుకున్నారు.