డీఎల్డీవో పోస్టు ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలో డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీఎల్డీవో ) పోస్టును ఏర్పాటు చేయాలని, గ్రూప్-1 కేడర్‌లోని ఎంపీడీవోలకు ఇతర శాఖల అధికారుల మాదిరిగానే సమాన పే సేల్ అమలు చేయాలని తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం (టీఎంపీడీవోలు) డిమాండ్ చేసింది.
- గ్రూప్-1తో సమానంగా సేల్
- ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఎంపీడీవోల సంఘం నిర్ణయం
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీఎల్డీవో ) పోస్టును ఏర్పాటు చేయాలని, గ్రూప్-1 కేడర్‌లోని ఎంపీడీవోలకు ఇతర శాఖల అధికారుల మాదిరిగానే సమాన పే సేల్ అమలు చేయాలని తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం (టీఎంపీడీవోలు) డిమాండ్ చేసింది. రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో సంఘం అధ్యక్షురాలు జే పద్మావతి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సెంట్రల్ కమిటీ సమావేశంలో 33 జిల్లాల ప్రతినిధులు పాల్గొని పలు కీలక తీర్మానాలు చేశారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లేందుకు డీఎల్డీవో పోస్టు అవసరమని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందించి సాధించేవరకు ఉద్యమించాలని నిర్ణయించారు. ఎంపీడీవోల సమస్యల పరిషారం కోసం నూతనంగా ఏర్పాటైన పంచాయతీరాజ్ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్‌లో క్రియాశీలక భాగస్వామ్యం వహించాలని తీర్మానించారు.
అడ్‌హక్ పద్ధతిలో పనిచేస్తున్న ఎంపీడీవోలను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతోపాటు, క్షేత్రస్థాయి విధులకు మౌలిక వసతి కల్పించాలని, ప్రజావాణి, మండల పరిషత్ కార్యాలయాల నెలవారీ నిర్వహణకు నిధులను విడుదల చేయాలని, అధికారుల పర్యటనల కోసం వాహన సదుపాయం కల్పిస్తూ ట్రెజరీ ద్వారా ప్రతినెలా నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎం మోహన్, అసోసియేట్ అధ్యక్షులు గంగుల సంతోష్‌కుమార్, కోశాధికారి కే మహేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

