తెలంగాణ ఎమ్మెల్సీ.. వయా కర్ణాటక
రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ పదవుల కాకా మొదలైంది. గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ పదవులకు గడువు ముగుస్తుండటంతో రేపో మాపో ఖాళీ అయ్యే పదవులకు పేర్లను రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేయాల్సి ఉంటుంది.
- ఉమ్మడి మెదక్ జిల్లా నేతకు ఎమ్మెల్సీ ఇప్పించేందుకు మార్గం సుగమం
- చక్రం తిప్పిన బోర్డర్ ఎమ్మెల్యే
- కబ్జా కాంగ్రెస్ నేతకు పదవిపై అసలు కాంగ్రెస్‌లో అంతర్మథనం
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ పదవుల కాకా మొదలైంది. గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ పదవులకు గడువు ముగుస్తుండటంతో రేపో మాపో ఖాళీ అయ్యే పదవులకు పేర్లను రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఓ నేత పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకున్నట్టు సమాచారం. 2023 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఆ నేత ఎమ్మెల్సీ అవ్వాలని కర్ణాటక లైన్ దొరికిచ్చుకున్నారు.
గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన ఆ నేత పార్టీ తరఫున ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఓ పారిశ్రామిక ప్రాంతం నుంచి ఎమ్మెల్యే టికెట్టు ఆశించి భంగపడ్డారు. దీంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ జాతీయ పార్టీ బీ ఫారంపై పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయారు. పీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ ముఖ్యనేత అండ ఉండటంతో ఎమ్మెల్సీ ఖాయమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యనేత సలహామేరకు ఏఐసీసీ పెద్దాయనను కలిశారని తెలిసింది. ఆయన అ ల్లుడి ద్వారా పైరవీచేసుకున్నట్టు సమాచారం.
మీడియేటర్ బోర్డర్ ఎమ్మెల్యే
కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన ఈ నేతను ఏఐసీసీ పెద్దాయన వద్దకు తీసుకెళ్లింది కర్ణాటక, మహారాష్ట్ర బోర్డర్లో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అని సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వేలుపెడుతున్నట్టు ఆరోపణలున్నాయి. కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన నేతను తీసుకొని ఏఐసీసీ నేత అల్లుడి వద్దకు తీసుకెళ్లి కలిపించారని కాంగ్రెస్‌లో ప్రచారం. ఆ అల్లుడితో బోర్డర్ ఎమ్మెల్యేకు వ్యాపార సంబంధాలున్నాయి. దీంతో ఎమ్మెల్సీ ఆశిస్తున్న నేతకు అభయం ఇచ్చేసినట్టు చెప్తున్నారు. దీని వెనుక భారీ ఎత్తున సొమ్ము కూడా చేతులు మారినట్టు కాంగ్రెస్‌లోని ఓ వర్గం ఆరోపిస్తున్నది. ఎంత సొమ్ము చేతులు మారిందనే దానిపై స్పష్టత లేదు.
మెదక్ ఎమ్మెల్యేలు గరం గరం
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న అసలు కాంగ్రెస్ నేతలు కొత్తగా చేరి ఎమ్మెల్సీ పదవి కోసం ఏఐసీసీ పెద్దాయనతో పైరవీ చేయించుకుంటున్న యువనేత తీరుపై మండిపడుతున్నారు. సంగారెడ్డి డీసీసీ విషయంలో కూడా ఎమ్మెల్యేల అభిప్రాయానికి విలువ ఇవ్వకుండానే డీసీసీ అధ్యక్షుడి నియామకం చేపట్టారని చెప్తున్నారు. జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి, పార్టీ నేతల అభిప్రాయం తీసుకోకుండానే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పీసీసీ చీఫ్, ముఖ్యనేత కలిసి కబ్జానేతను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, ఇదే జరిగితే ఊరుకునేది లేదని నేతలు చెప్తున్నారు. కబ్జానేతకు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారన్న వార్తలు రావడంతోనే జిల్లా నేతలు కొందరు పార్టీ ప్రధాన కార్యదర్శితోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జికి ఫిర్యాదులు చేశారు. ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన వ్యక్తికి మళ్లీ ఎమ్మెల్సీ ఎలా ఇస్తారంటూ లేఖలు రాశారు. ఒకవేళ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే తమదారి తాము చూసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

