అరచేతిలో అర్బన్ ఫారెస్ట్ పార్కులు

- ప్రత్యేక యాప్‌ను రూపొందించిన అటవీశాఖ
- ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 7 (నమస్తేతెలంగాణ): నగర, పట్టణ వాసులకు మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ఏర్పాటుచేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కుల పూర్తి సమాచారాన్ని చిటికెలో తెలుసుకొనే సౌలభ్యాన్ని అటవీశాఖ అందుబాటులోకి తెచ్చింది. ప్రకృతికి దగ్గరగా వెళ్లి ప్రశాంతత పొందాలనుకొనే పట్టణ వాసుల కోసం యాప్‌ను రూపొందించింది. శుక్రవారం అరణ్యభవన్‌లో అటవీశాఖ అధికారులతో కలిసి ఈ యాప్‌ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పార్క్‌ను ఒక్కో థీమ్‌తో అర్బన్ ఫారెస్ట్‌లుగా తీర్చిదిద్దామని చెప్పారు. హెచ్ఎండీఏ, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఉన్న 39 అర్బన్ ఫారెస్ట్ పార్కుల సమాచారాన్ని యాప్‌లో పొందుపరిచారు. రెండో దశలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కుల సమాచారాన్ని దీనిలో చేర్చనున్నారు. సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్ చొరవతో ఈ యాప్‌ను ‘పమ్టెన్-పీఏఎంటీఈఎన్’ సంస్థ రూపొందించింది. యాపిల్, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లలో urban forest parks అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు రేఖా నాయక్, నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్ఎం డోబ్రియల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

