బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు లాల్ సింగ్ చద్దా. టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య ఈ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సెకండ్ లాక్ డౌన్ తర్వాత ఇటీవలే నాగచైతన్య షూట్లో జాయిన్ అయ్యాడు. అమీర్ ఖాన్ అండ్ టీంతో చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. లాల్ సింగ్ చద్దా షూటింగ్ కశ్మీర్ లోని లడఖ్ లో జరుగుతోంది. తాజాగా షూటింగ్ లొకేషన్ నుంచి విడుదలైన స్టిల్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది.
అమీర్‌ఖాన్, చైతూ ఆర్మీ ఆఫీసర్ డ్రెస్సుల్లో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరితోపాటు డైరెక్టర్ అద్వైత్ చందన్ , అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా ఉన్నారు. వీరంతా బ్యూటీఫుల్ లొకేషన్ లో చిల్ అవుట్ అవుతున్న ఫొటో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతోంది. చైతూ ఈ సారి ఆర్మీ రోల్ కోసం చాలా వర్కవుట్ చేసి లుక్ ను మార్చుకున్నట్టు తాజా స్టిల్ చూస్తే అర్థమవుతోంది. లడఖ్‌లో సుమారు 20 రోజులపాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు బీటౌన్ టాక్.
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
నో ఓటీటీ..సిల్వర్ స్క్రీన్ పైనే ‘నారప్ప’ సందడి..!
ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్ లో వస్తున్న తెలుగు సినిమాలివే..!
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?