TSBIE | 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. వెబ్సైట్లో అందుబాటులో హాల్‌టికెట్లు
TSBIE | హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
TSBIE | హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు నేరుగా ఈ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు వస్తే, వారిని తప్పకుండా అనుమతించాలని బోర్డు అధికారులు చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. హాల్ టికెట్లపై ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్ సంతకాలు తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్ కూడా తమ లాగిన్ల ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

