విద్యాసంస్థల్లో భద్రతకు చట్టం.. సర్కార్‌కు చేరిన డ్రాఫ్ట్ బిల్లు
రాష్ట్రంలోని ప్రొఫెషనల్ కాలేజీలు, విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రతిపాదించింది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఈవెంట్స్ నిర్వహణకు కఠిన నిబంధనలు అమలు చేయాలని సిఫార్సు చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రొఫెషనల్ కాలేజీలు, విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రతిపాదించింది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఈవెంట్స్ నిర్వహణకు కఠిన నిబంధనలు అమలు చేయాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు ‘తెలంగాణ ఈవెంట్స్ ఫెసిలిటేషన్ అండ్ సేఫ్టీ’ డ్రాఫ్ట్ బిల్లును రూపొందించి సర్కార్‌కు అందజేసింది. ఇటీవలే నాదర్గుల్లోని ఎంవీఎస్సార్ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్లో ప్రమాదం జరుగడం, ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం.. మరికొందరు గాయపడిన విషయం విదితమే. అంతేకాకుండా ఇటీవలి కాలంలో కాలేజీల్లో అనేక ఈవెంట్స్ జరుగుతున్న నేపథ్యంలో మండలి ప్రత్యేక చొరవ తీసుకున్నది.
ఈవెంట్స్‌కు హాజరయ్యే జనం, వేదిక సామర్థ్యం, నిర్వహించే వేడుక ఆధారంగా రిస్క్‌ను అంచనావేయడం, భద్రతా ప్రమాణాలు పాటించడం, సంస్థాగత భద్రతా కమిటీల ఏర్పాటు, పోలీసు, అగ్నిమాపక, వైద్యారోగ్యశాఖల మధ్య అంతర్ ఏజెన్సీ సమన్వయం, శిక్షణ, మాక్‌డ్రిల్స్ నిర్వహణకు ప్రాధాన్యతనివ్వాలని సిఫార్సు చేసింది. ఈవెంట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని సూచించింది. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో సినిమా ఈవెంట్స్, ప్రమోషన్స్ నిర్వహణను మండలి సీరియస్‌గా తీసుకున్నది. దీనిపై విద్యార్థి సంఘాల ఫిర్యాదుమేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ విద్యాసంస్థలకు నోటీసు జారీచేశారు. నోటీసులు అందిన వెంటనే వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

