నిమ్స్ డిప్యూటీ రిజిస్ట్రార్‌కు వేతనాలు చెల్లించాలి
నిమ్స్ డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఉద్యోగికి నిర్బంధ ఉద్యోగ విరమణ విధించినప్పటి నుంచి తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు మధ్య కాలాన్ని సర్వీసుగా పరిగణించి వేతన బకాయిలు చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది.
-
అప్పీల్‌ను కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): నిమ్స్ డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఉద్యోగికి నిర్బంధ ఉద్యోగ విరమణ విధించినప్పటి నుంచి తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు మధ్య కాలాన్ని సర్వీసుగా పరిగణించి వేతన బకాయిలు చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిమ్స్ దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
నిమ్స్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేసిన వినోద్‌కుమార్ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి లీగల్ అసిస్టెంట్‌కు వేతన సేలు పెంచినట్టు ఆరోపణలు రావడంతో ఆయనకు చార్జిమెమో జారీ చేసి నిర్బంధ ఉద్యోగ విరమణ విధించారు. అనంతరం ఉద్యోగ విరమణ ప్రయోజనాల కల్పన కోసం 2006లో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. నిర్బంధ పదవీ విరమణ నుంచి పునర్నియామకం వరకు ఉన్న కాలానికి వేతన బకాయిలు చెల్లించకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

