వీసీ జానయ్యపై వేటు వేయాల్సిందే
అగ్రి వర్సిటీ వీసీ జానయ్య తన పదవిని అడ్డుపెట్టుకుని అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడని ‘టాసా’ అధ్యక్షుడు పవన్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సౌజన్య, విద్యార్థి సంఘం నాయకులు సత్యమూర్తి, రాజ్‌కుమార్ ఆరోపించారు. నియంతలా మారిన వీసీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులకు గురవుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీకి న్యాయం జరిగే వరకు ఆమెకు అండగా ఉంటామని స్పష్టంచేశారు. ఎనిమిది రోజులుగా మహిళలు, విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
- టాసా నాయకులు, విద్యార్థి సంఘాల నేతల డిమాండ్
వ్యవసాయ యూనివర్సిటీ , నవంబర్ 14 : అగ్రి వర్సిటీ వీసీ జానయ్య తన పదవిని అడ్డుపెట్టుకుని అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడని ‘టాసా’ అధ్యక్షుడు పవన్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సౌజన్య, విద్యార్థి సంఘం నాయకులు సత్యమూర్తి, రాజ్‌కుమార్ ఆరోపించారు. నియంతలా మారిన వీసీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులకు గురవుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీకి న్యాయం జరిగే వరకు ఆమెకు అండగా ఉంటామని స్పష్టంచేశారు. ఎనిమిది రోజులుగా మహిళలు, విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
శనివారం వారు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కళాశాల ఆవరణలో తెలంగాణ సైంటిస్ట్ అసోసియేషన్ (టాసా), విశ్వవిద్యాలయ టీచింగ్, నాన్ టీచింగ్, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విద్యార్థులు తరగతి గదుల్లోనే ప్ల కార్డులు ప్రదర్శించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీకి బీఆర్ఎస్, ఏబీవీపీ, వర్సిటీ విద్యార్థులు, ప్రజాంఘాలు, అధ్యాపకులు, విద్యార్థిసంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
అనంతరం రాజేంద్రనగర్ సీతారామాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. వీసీ స్వచ్ఛందంగా విధుల నుంచి తప్పుకొని విచారణకు వెళ్లాలని డిమాండ్ చేశారు. వీసీ విషయంలో మరికొందరు మహిళలు ముందుకు వస్తున్నారని గుర్తుచేశారు. వర్సిటీ ఘటనపై గవర్నర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో టాసా ప్రతినిధులు అమృత్‌రెడ్డి, సునీత, ప్రశాంత్, కమలాకర్, జయరాజ్, రమేశ్, త్రివేణి, పరమేశ్వర్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీకి మద్దతు తెలిపారు.
వీసీ అరాచకాలను అడ్డుకోవాలి : కార్తీక్‌రెడ్డి
వీసీ జానయ్య అరాచకాలను అడ్డుకోవాలి బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి పీ కార్తీక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ ఆవేదన వినకుండా, కొందరు బీసీ మేధావులు వీసీ జానయ్యను వెనుకేసుకు రావడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు, విద్యార్థులకు ఇస్తున్న భరోసా ఏమిటో బయటపడిందని అన్నారు. యూనివర్సిటీలో జరిగే అరాచకాలపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

