మరో వెయ్యి కోట్ల అప్పు!
తెలంగాణ ప్రభుత్వ అప్పుల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు రుణాలుగా సమీకరించిన కాంగ్రెస్ ప్రభు త్వం.. తాజాగా మరో రూ.1,000 కోట్లు అప్పు చేసేందుకు సిద్ధమైంది.
-
17న ఆర్బీఐ ఈ-వేలం ద్వారా రుణ సమీకరణ
-
ఏడు నెలల్లోనే రూ.54,900 కోట్లకు చేరిన అప్పులు
-
వార్షిక రుణ పరిమితిలో 89.33 శాతం వినియోగం
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ అప్పుల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు రుణాలుగా సమీకరించిన కాంగ్రెస్ ప్రభు త్వం.. తాజాగా మరో రూ.1,000 కోట్లు అప్పు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 17న ఆర్బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనున్నది. దీంతో 2026-27లో ఇప్పటివరకు ఆర్బీఐ వేలాల ద్వారా చేసిన అప్పులు రూ.54,900 కోట్లకు చేరనున్నాయి. వార్షిక రుణ లక్ష్యం రూ.61,457.16 కోట్లలో ఇది ఏకం గా 89.33 శాతం. అంటే ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా ఐదు నె లలు మిగిలి ఉండగానే రుణ లక్ష్యంలో దాదాపు 90 శాతాన్ని ప్రభుత్వం వాడేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక రుణ లక్ష్యాన్ని రూ.61,457.16 కోట్లుగా నిర్ణయించారు.
ఏప్రిల్ 7న రూ.3,900 కోట్లతో ప్రారంభమైన రుణ సమీకరణ.. నవంబర్ వరకు వరుస వేలాలతో కొనసాగింది. జూలై 1న రూ.7,000 కోట్లు, సెప్టెంబర్ 15న రూ.7,500 కోట్ల చొ ప్పున భారీగా సేకరించారు. నవంబర్ 17న మరో రూ.1,000 కోట్లు తీసుకోనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చాల్సిన ప్రభుత్వం.. వరుసగా అప్పులపై ఆధారపడుతుండటం విమర్శలకు తా విస్తున్నది. వార్షిక రుణ లక్ష్యంలో ఇప్పటికే 89 శాతానికిపైగా వినియోగించడంతో మిగిలిన ఆర్థిక సంవత్సరంలో నిధుల అవసరాలను ఎలా తీర్చబోతున్నారనే సందేహాలు తలెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

