దాంపత్యంలో గొడవలు క్రూరత్వం కావు
దాంపత్య జీవితంలో తలెత్తే చిన్నపాటి గొడవలు, అభిప్రాయభేదాలను మానసిక క్రూరత్వంగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టంచేసింది. విడాకులు మంజూరు చేయాలంటే జీవిత భాగస్వామి ప్రవర్తన తీవ్రంగా ఉండి, వారితో కలిసి జీవించడం సాధ్యంకాని పరిస్థితులు ఉండాలని పేరొంది. స్వల్ప వివాదాల ఆధారంగా వివాహబంధాన్ని రద్దు చేయలేమని తేల్చిచెప్పింది.
- విడాకులకు నిరాకరించిన హైకోర్టు
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): దాంపత్య జీవితంలో తలెత్తే చిన్నపాటి గొడవలు, అభిప్రాయభేదాలను మానసిక క్రూరత్వంగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టంచేసింది. విడాకులు మంజూరు చేయాలంటే జీవిత భాగస్వామి ప్రవర్తన తీవ్రంగా ఉండి, వారితో కలిసి జీవించడం సాధ్యంకాని పరిస్థితులు ఉండాలని పేరొంది. స్వల్ప వివాదాల ఆధారంగా వివాహబంధాన్ని రద్దు చేయలేమని తేల్చిచెప్పింది. 2009లో వివాహమైన దంపతులకు కుమార్తె జన్మించిన తర్వాత భార్య వేధింపులకు పాల్పడుతున్నదంటూ భర్త విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరించిన కిందికోర్టు.. దాంపత్య హకుల పునరుద్ధరణకు భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి ఇచ్చిన తీర్పులను సవాలు చేస్తూ భర్త హైకోర్టులో అప్పీల్ చేశారు. వీటిపై జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ కే సుజనలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
భార్య మానసిక సమస్యతో బాధపడుతున్నదన్న భర్త ఆరోపణకు ఎలాంటి ఆధారాలు చూపలేదని ధర్మాసనం పేరొంది. భార్య, అత్తమామలు ఇల్లరికం రావాలని పట్టుబట్టారన్న ఆరోపణకూ ఆధారాలు లేవని తెలిపింది. గృహహింస కేసు పెట్టి వేధించారంటూ భర్త విడాకులు కోరినప్పటికీ, భార్య కేసు దాఖలు చేయడాన్ని మాత్రమే క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టంచేసింది. గృహహింస కేసును కొట్టివేసినప్పటికీ, నిర్వహణ ఖర్చులు చెల్లించాలని కోర్టు ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించింది. కేసు దాఖలైన సమయంలో భర్త వయసు 36, భార్య వయసు 30 ఏండ్లు కాగా, ప్రస్తుతం వారి వయసులు వరుసగా 50, 44 ఏండ్లు. కుమార్తెకు 16 ఏండ్లు. దంపతులు 14 ఏండ్ల్లుగా విడిగా ఉంటున్నప్పటికీ, వారి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నట్టు నిరూపణ కాలేదని ధర్మాసనం పేరొంది. స్వల్ప కారణాలతో విడాకుల వరకు వెళ్లిన ఈ వ్యవహారంలో కింది కోర్టు తీర్పులను సమర్థిస్తూ భర్త అప్పీళ్లను కొట్టివేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

