KTR | కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని ఏసీబీ నిన్న నోటీసులు పంపించింది. అయితే ఈ విచారణకు లాయర్లతో హాజరయ్యేందుకు అనుమతించాలని కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని ఏసీబీ నిన్న నోటీసులు పంపించింది. అయితే ఈ విచారణకు లాయర్లతో హాజరయ్యేందుకు అనుమతించాలని కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.
కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌కు హైకోర్టు అంగీకరించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపింది.
కాగా, ఫార్ములా ఈ-కార్ రేస్‌పై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టాలని కోరితే ముఖ్యమంత్రి ఎందుకు పారిపోయారని, రేవంత్‌రెడ్డికి దమ్ముంటే.. ఆయ న జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో మీడియా సమక్షంలో చర్చ పెడితే తాను రెడీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ఆ తర్వాత ఏసీబీ విచారణకైనా, ఈడీ విచారణకైనా సిద్ధమేని స్పష్టంచేశారు. రాజ్యాంగం, న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉన్నదని, తనపై మోపిన అక్రమ కేసులపై న్యాయస్థానాల్లోనే కొట్లాడుతామని తేల్చిచెప్పారు. ఈ కేసులు ఆరంభం మాత్రమేనని, నాలుగేండ్లలో ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఎదురొంటామని, దేశానికి రక్షణ కవచంలా న్యాయ వ్యవస్థ ఉన్నదని పేర్కొన్నారు. ‘నిజాయితీకి ధైర్యం ఎకువ.. రోషంగల్ల తెలంగాణ బిడ్డగా ఏ విచారణనైనా ఎదురొనేందుకు సిద్ధం’ అని చెప్పారు. లాయర్లతో విచారణకు బుధవారం హైకోర్టు అనుమతిస్తే 9న ఏసీబీ విచారణకు లాయర్లతో వెళ్తానని తెలిపారు. 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతానని, వారు ఏమడిగినా సమాధానం చెప్తానని, దాపరికం లేదు.. దాయాల్సిందేమీ లేదని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

