ప్రభుత్వం భూములు అమ్మొచ్చు.. బీజేపీ నేత విజయశాంతి పిల్ కొట్టివేత
తన ఆధీనంలోని భూములను అమ్ముకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, దీనిపై ఏవిధమైన అభ్యంతరమూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం భూములను విక్రయించడాన్ని అడ్డుకొనే చట్టం ఏదీ లేదని తెలిపింది
తుది ఆదేశాలు జారీచేసిన హైకోర్టు..
హైదరాబాద్, ఫిబ్రవరి 17 : తన ఆధీనంలోని భూములను అమ్ముకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, దీనిపై ఏవిధమైన అభ్యంతరమూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం భూములను విక్రయించడాన్ని అడ్డుకొనే చట్టం ఏదీ లేదని తెలిపింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామాల్లోని భూముల వేలం ప్రక్రియను అడ్డుకోవాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. కోకాపేటలో 49.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.91 ఎకరాల భూముల వేలాన్ని నిలిపివేయాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ, నటి విజయశాంతి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టి వేసింది. భూముల వేలం ప్రక్రియకు టెండర్లు, ఈవేలం వంటి విధానాలను అమలుచేయడం ద్వారా ప్రభుత్వం పారదర్శకత పాటించాలని షరతులు విధించింది. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. గతంలో విచారణ చేసిన హైకోర్టు, భూముల వేలం ప్రక్రియ కొనసాగింపునకు అనుమతి ఇస్తూనే తమ అనుమతి లేకుండా ఏవిధమైన విక్రయాలు నిర్వహించరాదని ఆదేశించింది. పిల్‌ను డిస్మిస్ చేయడం, తాజా ఉత్తర్వుల నేపథ్యంలో భూముల విక్రయాలకు అడ్డంకులు తొలగిపోయాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

