CM Revanth Reddy | కట్టేది 2వేల కోట్లు.. చెప్పేది 7వేల కోట్లు.. మిత్తిపై సీఎం రేవంత్ తప్పుడు లెక్క
‘అబద్ధం ఆడితే అతికినట్టుండాలి’ అన్నది పాతకాలం నాటి నానుడి. కానీ సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఒక అబద్ధాన్ని పదేపదే వల్లెవేస్తూ.. అదే నిజమనే భావన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు.
- వడ్డీలపై లెక్క తప్పిన సీఎం.. అప్పులపై బీద అరుపులు
- గత ప్రభుత్వ అప్పులపైనా అదే తప్పుడు ప్రచారం
- పదేండ్ల ఆర్థికవృద్ధి మరువొద్దంటున్న నిపుణులు
- రెండున్నర రెట్లు పెరిగిన తెలంగాణ తలసరి ఆదాయం, జీఎస్డీపీ, పన్ను రాబడి
CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ‘అబద్ధం ఆడితే అతికినట్టుండాలి’ అన్నది పాతకాలం నాటి నానుడి. కానీ సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఒక అబద్ధాన్ని పదేపదే వల్లెవేస్తూ.. అదే నిజమనే భావన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నెలవారీగా చెల్లిస్తున్న మిత్తీలపై కాకిలెక్కలు చెప్తున్నారని ఆరోపిస్తున్నారు. ‘గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు అప్పు చేసింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల రూ.7వేల కోట్ల మిత్తీలు కడుతున్నాం’ అని సీఎం రేవంత్రెడ్డి మొదటినుంచీ ఆరోపిస్తున్నారు. తాజాగా గురువారం రుణమాఫీ నిధులు విడుదల సందర్భంగా సైతం అవే వ్యాఖ్యలు చేశారు. పైగా ‘ప్రతిసారి తిన్నా.. తినకపోయినా.. ఉపవాసం ఉండి అయినా ప్రతి నెల రూ.7వేల కోట్ల మిత్తీలు కడుతున్నాం’ అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యమంత్రి చెప్పింది పచ్చి అబద్ధమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇందుకు కాగ్కు సమర్పించిన గణాంకాలనే సాక్ష్యంగా చూపుతున్నారు. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మే నెల వరకు ఆరు నెలల్లో వడ్డీల కింద చెల్లించిన మొత్తం రూ.12,199 కోట్లు. అంటే సగటున నెలకు కట్టింది రూ.2,033 కోట్లు మాత్రమే. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అయితే నెలకు రూ.1865 కోట్లు మాత్రమే చెల్లించారు. కానీ సీఎం రేవంత్రెడ్డి పదేపదే రూ.7వేల కోట్లు చెల్లిస్తున్నట్టు చెప్తున్నారని విమర్శిస్తున్నారు. ఒక్క రూపాయి కట్టి మూడున్నర రెట్లు కట్టినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.
అప్పులపైనా అదే ప్రచారం
గత ప్రభుత్వం చేసిన అప్పులపైనా సీఎం రేవంత్రెడ్డి పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం నిరుడు డిసెంబర్లో అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేత పత్రం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అన్ని రకాల అప్పులు కలిపి రూ.6.71 లక్షల కోట్లు. ఇందులో ఎఫ్ఆర్బీఎం రుణాలు రూ.3.89 లక్షల కోట్లు మాత్రమే. మిగతావి ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు గ్యారెంటీగా ఉండి సమీకరించిన రుణాలు. వాస్తవానికి తెలంగాణ ఏర్పడేనాటికే వారసత్వంగా రూ.72,658 కోట్ల అప్పులు వచ్చాయి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేసిన అప్పులు రూ.6 లక్షల కోట్లు మాత్రమే. కానీ సీఎం రేవంత్రెడ్డి రూ.లక్ష కోట్లు అదనంగా చేర్చి చెప్తున్నారని విమర్శిస్తున్నారు.
ఆర్థిక వృద్ధి సంగతేమిటి?
కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిందని సీఎం రేవంత్రెడ్డి, ఇతర మంత్రులు, కాంగ్రెస్ నేతలు పదేపదే విమర్శిస్తున్నారే తప్ప.. గత పదేండ్లలో జరిగిన ఆర్థిక ప్రగతిని ఎందుకు గుర్తించడంలేదని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్, తలసరి ఆదాయం, జీఎస్డీపీ, పన్ను రాబడుల పరంగా తెలంగాణ గణనీయమైన వృద్ధిని సాధించించిందని చెప్తున్నారు. జనాభాపరంగా దేశంలో 12వ స్థానం, విస్తీర్ణంపరంగా 11వ స్థానంలో ఉన్న తెలంగాణ ఆర్థిక వృద్ధిలో, అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానానికి ఎదిగిందని చెప్తున్నారు. కానీ ఈ వాస్తవాలను ప్రభుత్వం కప్పిపుచ్చుతున్నదని మండిపడుతున్నారు.
- 2014-15లో రూ.1,00,638 కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ 2023-24 నాటికి రూ.2,90,396 కోట్లకు చేరింది. అంటే.. దాదాపు మూడు రెట్లు పెరిగింది. రాష్ట్ర పద్దు ఏటా 12.69 శాతం వృద్ధి నమోదు చేసింది.
- రాష్ట్రంలో తలసరి ఆదాయం 2014-15లో రూ.1,24,104 ఉండగా, 2023-24 నాటికి రూ.3,17,117కు పెరిగింది. అంటే.. రెండున్నర రెట్ల పెరుగుదల నమోదైంది. 2014లో తలసరి ఆదాయంలో దేశంలో 10వ స్థానంలో ఉండగా, 2023 నాటికి అగ్రస్థానానికి చేరిందని నిపుణులు పేర్కొంటున్నారు.
- 2014లో రాష్ట్ర జీఎస్డీపీ రూ. 3.79 లక్షల కోట్లు ఉండగా.. 2023-24 నాటికి రెండున్నర రెట్లు పెరిగి రూ.13.28 లక్షల కోట్లకు చేరింది.
- 2014లో తలసరి ఆదాయం రూ. 93,151గా ఉంటే, 2023 నాటికి రూ. 3,12,398 చేరుకున్నది. అంటే 235 శాతం పెరిగింది.
- రాష్ట్ర రెవెన్యూ రాబడులు 2014-15లో రూ.51,042 కోట్లు మాత్రమే. ఇది 2023-24 నాటికి రూ.2,16,567 కోట్లకు చేరాయి. అంటే దాదాపు నాలుగున్న రెట్లు పెరిగాయి.
- రాష్ట్ర సొంత రాబడులను గణించినా.. 2015-16లో రూ.39,974 కోట్లుగా ఉండగా 2023-24 నాటికి రూ.1.31 లక్షల కోట్లకు చేరుకున్నది. తొమ్మిదేండ్లలో 227 శాతం పెరుగుదల కనిపించింది. సగటున లెక్కించినప్పుడు ఏటా రికార్డు స్థాయిలో 18.97 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది.
- తెలంగాణ చిన్న రాష్ట్రమైనా.. దేశ జీడీపీ వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నదని మాజీ సీఎం కేసీఆర్ పదేపదే చెప్పేవారు. దీనికి తగ్గట్టే దేశ జీడీపీలో తెలంగాణ వాటా ప్రతి సంవత్సరం పెరుగుతూనే వచ్చింది. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.7 శాతం మాత్రమే అయినా.. 2014-15లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.1% కాగా, పదేండ్లలో 4.9 శాతానికి పెరిగింది.
- రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. తెలంగాణ సాధించిన ఈ ఆర్థిక విజయాలను ఎందుకు ప్రస్తావించడం లేదని ఆర్థిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర పరపతిపై దెబ్బ?
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పదేపదే బీద అరుపులు అరిస్తే రాష్ట్ర పరపతి దెబ్బతినే అవకాశం ఉన్నదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ లబ్ధికోసం ప్రతి వేదికపై మాట్లాడటం వల్ల కార్పొరేట్ సంస్థలకు రాష్ట్రంపై ఉన్న అభిప్రాయం పోతుందని చెప్తున్నారు. దీనికితో డు నెలకు రూ.7వేల కోట్ల వడ్డీలు చెల్లిస్తున్నామని చెప్పడం ద్వారా అప్పును మూడురెట్లు అధికంగా చూపుతున్నట్టేనని.. తద్వా రా రాష్ట్రం దివాలా అంచున ఉన్నదనే భావ న కలిగిస్తున్నారని అంటున్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని అంటున్నారు.ఇప్పటికైనా సీఎం తన వ్యవహార శైలిని మార్చుకోవాలని సూచిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM Revanth Reddy
- Congress
- gsdp
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

