పోలవరం-నల్లమలకు అనుమతులివ్వొద్దు
ఏపీ పునర్విభజన చట్టం-2014కి విరుద్ధంగా పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును చేపట్టకుండా ఏపీ సర్కారును సత్వరం నిలువరించాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(జీఆర్ఎంబీ)కి తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది.
- ఏపీని నిలువరించాలని జీఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు లేఖ
హైదరాబాద్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): ఏపీ పునర్విభజన చట్టం-2014కి విరుద్ధంగా పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును చేపట్టకుండా ఏపీ సర్కారును సత్వరం నిలువరించాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(జీఆర్ఎంబీ)కి తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. ఈమేరకు జీఆర్ఎంబీకి తెలంగాణ నీటి పారుదలశాఖ ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ మంగళవారం లేఖ రాశారు. గోదావరి జలాలను మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం అనేక విధాలుగా యత్నిస్తున్నదని, గతంలో గోదావరి-పెన్నా ఇంటర్ రివర్ లింక్ ప్రాజెక్టు చేపట్టిందని, ఇటీవల కొద్దిగా మార్చి పోలవరం-బనకచర్ల లింక్‌గా తెరమీదికి తీసుకొచ్చిందని గుర్తుచేశారు.
కేంద్ర ఏజెన్సీలు, తెలంగాణ వ్యతిరేకించడంతో ఆయా ప్రాజెక్టుల్లో మళ్లీ మార్పులు చేసి ఇప్పుడు కొత్తగా పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైందని పేర్కొన్నారు. ఇప్పటికే డీపీఆర్ తయారీ, ఇన్వెస్టిగేషన్ కోసం టెండర్లు కూడా ఆహ్వానించిందని, ఇది ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధమని తెలిపారు. గోదావరి జలాల మళ్లింపు వల్ల కో బేసిన్ రాష్ర్టాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. జీఆర్ఎంబీ ఈ విషయంలో సత్వరం స్పందించి ప్రాజెక్టుపై ముందుకు వెళ్లకుండా చూడాలని ఈఎన్సీ ఆ లేఖలో డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

