త్వరలోనే 2 వేల పల్లె దవాఖానాలు ప్రారంభం : మంత్రి హరీశ్‌రావు
Minister Harish Rao | రాష్ట్రంలోని ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖానాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ నెలలోనే 2 వేల పల్లె దవాఖానాలను ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. బాగ్‌లింగంపల్లిలోని
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖానాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ నెలలోనే 2 వేల పల్లె దవాఖానాలను ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ఏఎన్ఎంల 2వ మహాసభలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
ఏఎన్ఎంలు రెండో మహాసభలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. కరోనా సమయంలో ఏఎన్ఎంలు అందించిన సేవలు అమూల్యమని ప్రశంసించారు. వైద్యారోగ్య, పారిశుద్ధ్య, పోలీసులు కలిసి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేశారని కొనియాడారు.
ప్రాథమిక వైద్యంలో ఏఎన్ఎంలది కీలకపాత్ర
ప్రాథమిక వైద్యం అందించడంలో ఏఎన్ఎంలది కీలకపాత్ర అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్లో ఏఎన్ఎంలు కీలక పాత్ర పోషించాలన్నారు. బీపీ, షుగర్, క్యార్సర్ వ్యాధి సోకినట్లు చాలా మందికి తెలియదు. అలాంటి వారిని ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తే.. రోగాలకు దూరంగా ఉండొచ్చని సూచించారు.
బస్తీ దవాఖానాలు సూపర్ హిట్
హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన 350 బస్తీ దవాఖానాలు సూపర్ హిట్ అయ్యాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ దవాఖానాల ఏర్పాటుతో గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో ఓపీ తగ్గిందన్నారు. జిల్లాల్లో కూడా బస్తీ దవాఖానలు పెడుతున్నాం. మొత్తం 500 ఏర్పాటు చేస్తున్నాం. ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖనలుగా అప్ గ్రేడ్ చేస్తున్నాం. ఈ నెలలో 2000 పల్లె దవాఖానాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోబోతున్నాము అని హరీశ్ రావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

