పల్లె దవాఖానలకు మరో 1,492 పోస్టులు
ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పల్లె దవాఖానల్లో మరో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేందుకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- కాంట్రాక్టు పద్ధతిలో ఎంఎల్‌హెచ్‌పీల నియామకానికి ఆర్థికశాఖ ఉత్తర్వులు
- ఇప్పటికే 1,569 పోస్టులకు నోటిఫికేషన్.. తుది దశలో ప్రక్రియ
హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పల్లె దవాఖానల్లో మరో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేందుకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రోగాలను ప్రాథమిక స్థాయిలోనే నిర్థారించి, చికిత్స అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 4,745 ఏఎన్ఎం సబ్ సెంటర్లు ఉండగా, ఇందులో 3,206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా అభివృద్ధి చేస్తున్నది. వీటికోసం ఇప్పటికే తొలి విడతగా 1,569 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ సర్వీసెస్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించేందుకు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. తాజాగా మరో 1,492 మంది ఎంఎల్‌హెచ్‌పీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తం 3,061 పోస్టులు భర్తీ కానున్నాయి.
పల్లెలకు నాణ్యమైన సేవలు
రాష్ట్రంలోని 3,206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చుతుండటంతో పల్లెలకు ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులోకి రానున్నారు. ఇప్పటికే పీహెచ్‌సీల్లో మెడికల్ ఆఫీసర్లుగా ఎంబీబీఎస్ వైద్యులు పనిచేస్తున్నారు. వీరికి అదనంగా మరో మూడు వేల మంది గ్రామాల్లో సేవలు అందించేలా పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ దవాఖానల్లో ఓపీతోపాటు అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించనున్నారు. నమూనాలను సేకరించి, టీ డయాగ్నస్టిక్స్ కేంద్రాలకు పంపి పరీక్షలు చేయనున్నారు. వ్యాధి నిర్ధారణ ఫలితాలను బట్టి అవసరమైన చికిత్స అందిస్తారు. తద్వారా వ్యాధి ముదరక ముందే గుర్తించే అవకాశం కలుగుతుంది. బాధితులు ధైర్యంగా ఉంటారు. ఒకవేళ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే పై దవాఖానలకు రెఫర్ చేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!


