Runa Mafi | నేడు లక్ష రుణం మాఫీ.. జాబితాపై రైతుల్లో ఆందోళన
రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. తొలిదశలో సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణం ఉన్న 11.42 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనున్నది.
- సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లోకి 6098 కోట్లు
- 11.42 లక్షల మందికి రుణవిముక్తి
- ట్రయల్న్ నిర్వహించిన అధికారులు
- రైతువేదికల్లో సంబురాలకు ఏర్పాట్లు
- రుణమాఫీ జాబితాపై రైతుల్లో ఆందోళన
- మూడు విడతల్లో రుణమాఫీ: రేవంత్
- నిద్రలేని రాత్రులు గడిపాం: భట్టి
Runa Mafi | హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. తొలిదశలో సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణం ఉన్న 11.42 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనున్నది. ఇందుకు సంబంధించి వ్యవసాయ, ఆర్థిక శాఖలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశాయి. వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు ట్రయల్న్ కూడా నిర్వహించారు.
ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. రుణమాఫీకి మొత్తం 39 లక్షల కుటుంబాలు అర్హత సాధించగా, ఇందులో 60 లక్షల మంది రైతులు ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రుణమాఫీకి మొత్తం రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. గురువారం రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తుండగా, నెలాఖరులోగా రూ.1.5 లక్షల వరకు, ఆగస్టులో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ ముహూర్తం పెట్టిన ప్రభుత్వం ఆ ప్రక్రియ పూర్తి కాగానే రైతు వేదికల్లో సంబురాలు నిర్వహించాలని నిర్ణయించింది. రుణమాఫీ నిధులను విడుదల చేసిన అనంతరం సీఎం రేవంత్రెడ్డి ఆన్లైన్ ద్వారా రైతులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రైతువేదికల్లో వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రతి గ్రామం నుంచి రైతులను తరలించే ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారి వారి నియోజకవర్గాల్లో రుణమాఫీ సంబురాల్లో పాల్గొననున్నారు.
జాబితాలపై ఫిర్యాదులు.. రైతుల్లో ఆందోళన
రుణమాఫీకి సంబంధించి అధికారులు రూపొందించిన జాబితాపై గ్రామాల్లో గందరగోళం నెలకొన్నది. తమ పేర్లు జాబితాలో లేవంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రూ.లక్ష వరకు గల రుణ గ్రహీతల జాబితాను వ్యవసాయ శాఖ జిల్లాలకు విడుదల చేసింది. అయితే ఇందులో పలు సమస్యలు ఎదురైనట్టు తెలిసింది. బుధవారం రాత్రి వరకు కూడా కొన్ని జిల్లాల్లో ఏఈవోలకు జాబితా అందలేదని సమాచారం. మరోవైపు, జాబితాలో పేర్లపై రైతుల్లో ఆందోళన నెలకొన్నది. రూ.లక్షలోపు రుణం ఉన్నప్పటికీ తమ పేరు జాబితాలో లేదంటూ వ్యవసాయ శాఖ అధికారులకు పలువురు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ విడుదల చేసిన జాబితాలో కేవలం రైతు పేరు, గ్రామం, క్లస్టర్ పేరు మాత్రమే ఉన్నది. ఏ రైతుకు ఎంత మాఫీ చేస్తున్నారనే వివరాలను జాబితాలో పేర్కొనలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

