ఆదా అయ్యే నీటిని బేసిన్ ప్రాజెక్టులకివ్వాలి
కృష్ణా డెల్టా వ్యవస్థ (కేడీఎస్) ఎడమ కాల్వ కింద ఉన్న కొంత భూమి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలోకి వెళుతుందని, కాబట్టి ఆ మేరకు ఏపీకి సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా అందిస్తున్న నీటి అవసరాలు తగ్గుతాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
- బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో తెలంగాణ వాదనలు
హైదరాబాద్, మే15 (నమస్తే తెలంగాణ): కృష్ణా డెల్టా వ్యవస్థ (కేడీఎస్) ఎడమ కాల్వ కింద ఉన్న కొంత భూమి ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలోకి వెళుతుందని, కాబట్టి ఆ మేరకు ఏపీకి సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా అందిస్తున్న నీటి అవసరాలు తగ్గుతాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. తద్వారా ఆదా అయ్యే నీటిని బేసిన్‌లోని ప్రాజెక్టులకు కేటాయించాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు నివేదించింది.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో గురువారం పునఃప్రారంభమైంది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట తెలంగాణ సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలను వినిపించారు. సీఆర్డీఏ పరిధిలోకి వెళ్లే ప్రాంతాలకు సాగునీటి అవసరం ఉండబోదని తెలిపారు. ఆ నీటిని బేసిన్ ప్రాజెక్టులకు కేటాయించాలని వాదించారు.
ఎన్సీపీ కుడి కాల్వ కింద ఆయకట్టులో కొంత భాగానికి పులిచింతల ప్రాజెక్ట్ నుంచి నీటిని ఎత్తివేయడం వంటి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా సాగునీటిని అందించవచ్చని తెలిపారు. పెన్నా, ఇతర బేసిన్లలో ఏపీకి 360 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యముందని, ఆ నిల్వకు 1.4 రెట్లు నీటిని ఉపయోగించుకునే అ వకాశముందని వాదించారు. తాజాగా బొల్లేపల్లి జలాశయాన్ని 150 టీఎంసీలతో నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుందని గుర్తుచేశారు.
ఆరుతడి పంటలు సాగుచేయాలి
ప్రాజెక్టుల్లో పంట నీటి అవసరాన్ని అంచనా వేసేందుకు శాస్త్రీయ పద్ధతుల ను అవలంబించాలని కోరుతూ, దీనిపై తెలంగాణ తరపున డాక్టర్ పళనిసామి సమర్పించిన వ్యవసాయ అఫిడవిట్‌ను ట్రిబ్యునల్ దృష్టికి వైద్యనాథన్ తీసుకెళ్లారు. బేసిన్ వెలుపలి ప్రాంతాల్లో తడి పంటలకు బదులుగా ఆరుతడి పంటలను సాగుచేసేలా చూడాలని, అలా వివిధ మార్గాల ద్వారా ఆదా చేసిన నీటిని బేసిన్‌లోని కరువు ప్రాంతాలకు కేటాయించవచ్చని వివరించారు. ఇది ఎకువ మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

