ఆంధ్రా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడటం లేదన్నారు. హైదరాబాద్లో ఉన్న ఆంధ్రా ప్రజలను కంటికి రెప్పలా

మహబూబ్నగర్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తెలంగాణ మంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. తాము ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకే వ్యతిరేకం, ఆంధ్రా ప్రజలకు కాదని మంత్రులు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఏపీ నాయకులు.. ఈ వివాదంలోకి ప్రజలను లాగడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.
మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో సీమాంధ్ర ప్రజలు ఉన్నారని, ఏపీ సీఎం జగన్, మంత్రులు మాట్లాడటం బాధాకరమన్నారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడటం లేదన్నారు. హైదరాబాద్లో ఉన్న ఆంధ్రా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తుందని ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాను ఎడారిని చేసేందుకు ఏపీ సీఎం ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్ను కాదని పెన్నా నదికి నీటిని తరలించడం మంచిది కాదు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు.. ఈ విషయం కృష్ణా బోర్డుకు తెలియదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్ సహించరు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

