మాట నిలబెట్టుకొన్న ప్రభుత్వం.. పోలీస్ ఉద్యోగార్థుల కటాఫ్ మార్కుల తగ్గింపు
పోలీసు ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నది. కటాఫ్ మార్కులను తగ్గించింది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం తెలంగాణ పోలీస్ నియామక మండలి కటాఫ్ మార్కులపై జీవోను సవరిస్తూ ఉత్తర్వులిచ్చింది.
- జీవోను సవరిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : పోలీసు ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నది. కటాఫ్ మార్కులను తగ్గించింది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం తెలంగాణ పోలీస్ నియామక మండలి కటాఫ్ మార్కులపై జీవోను సవరిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఓసీ అభ్యర్థులకు 30శాతం, బీసీ అభ్యర్థులకు 25శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 20శాతం మార్కులను కేటాయిస్తున్నట్టు తన అధికారిక వెబ్సైట్లో నోటీసు ద్వారా వెల్లడించింది.
దీనిప్రకారం.. 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఓసీ అభ్యర్థులకు 60 మార్కులు, బీసీ అభ్యర్థులకు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు. శారీరధారుడ్య పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు 30 శాతంగా, బీసీలకు 35 శాతంగా, ఓసీలకు 40 శాతంగా ఉండేవి. కానీ, ఈసారి సామాజికవర్గాలతో సంబంధం లేకుం డా అందరికీ 30 శాతం మార్కులను అర్హతగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంటే పరీక్షలో 200 ప్రశ్నలకు 60 మార్కులు వస్తే సరిపోతుంది. మళ్లీ ఇందులో నెగెటివ్ మార్కులు ఉంటాయి. దీని ప్రకారం ఓసీలకు 10 శాతం, బీసీలకు 5 శాతం సడలింపు ఇచ్చినట్టయింది. తమకు ఎలాంటి సడలింపు ఇవ్వలేదని ఎస్సీ, ఎస్టీలు ఆందోళనకు దిగాయి. దాంతో ప్రభుత్వం స్పందించి జీవోను సవరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

