బోనాల ఉత్సవాలకు రూ. 15 కోట్లు విడుదల : మంత్రి తలసాని
మంత్రి తలసాని | ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ ఆలయాలకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

హైదరాబాద్ : ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ ఆలయాలకు ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి మంజూరు చేసిన రూ. 15 లక్షల చెక్కును సోమవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్‌లోని మిగిలిన ఆలయాలకు రేపు ఉదయం శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

