Development Funds : ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రూ.2.50 కోట్లు.. నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల
Development Funds | రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి నిధులను విడుదల చేసింది.

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి నిధులను విడుదల చేసింది. బడ్జెట్లో కేటాయించిన మేరకు మొదటి రెండు త్రైమాసికాలకు (ఆరునెలలు) కలిపి రూ. 382.50 కోట్లను విడుదల చేస్తూ మంగళవారం ప్రణాళికా శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి రూ.2.50 కోట్లు చేరనున్నాయి. జిల్లా కలెక్టర్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నుంచి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలను స్వీకరించాలని, పరిశీలించిన అనంతరం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ రూ.382 కోట్లలో రూ.59 కోట్లు ఎస్సీ నియోకవర్గాలకు, రూ.34.73 కోట్లు ఎస్టీ నియోజకవర్గాలకు చేరనున్నాయి. నూతనంగా ఏర్పడిన నారాయణపేట, ములుగు జిల్లాలకు సంబంధించిన నిధులను మహబూబ్‌నగర్, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ల ఖాతాలకు బదిలీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

