ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. వేతన సవరణ ఉత్తర్వులు జారీ
వేతన సవరణ ఉత్తర్వులు జారీ | ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేస్తూ నిర్ణయం తీసుకొని ఈ మేరకు స్కేళ్లను సవరించింది. దీంతో 2018 జులై 1 నుంచి ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అమల్లోకి వచ్చినట్లయ్యింది.
ఉద్యోగుల కనీస వేతనం రూ. 19 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లను కొనసాగించింది. 2018 జులై వరకు ఉన్న డీఏ 30.39 శాతం మూలవేతనంలో కలవనున్నది. 2020 ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు మానిటరీ లబ్ధి చేకూరనుంది. బకాయిలను పదవీ విరమణ సమయంలో ప్రభుత్వం చెల్లించనుంది. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి 31 వరకు బకాయిలు చెల్లింపు చేయనుంది. ఏప్రిల్, మే బకాయిలను సైతం ఈ ఏడాదే ప్రభుత్వం చెల్లించనుంది. జూన్ నుంచి ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

