Mayonnaise | తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో మయోనైస్‌పై నిషేధం
Mayonnaise | తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైస్‌పై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
Mayonnaise : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైస్‌పై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ మేరకు త్వరలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. రాష్ట్రంలో హోటళ్లు, ఫుడ్‌స్టాళ్లలో తరచూ తనిఖీలు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు.
రాష్ట్రంలో కొత్తగా 3 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు, 5 మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. కల్తీ ఆహారం తీసుకొని పలువురు తీవ్ర అనారోగ్యం పాలవుతున్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మయోనైస్‌ను ఎక్కువగా.. మండి బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు, ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకుని తింటారు. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలతో బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం అప్రమత్తమైంది.
ఎన్నిసార్లు చెప్పినా హోటళ్లు తీరు మార్చుకోవడం లేదంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ పదార్థాన్ని నిషేధించేందుకు అనుమతి కోరింది. బంజారాహిల్స్‌లోని నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరిశంకర్‌కాలనీలలో గత శుక్రవారం ‘దిల్లీ హాట్ మోమోస్’ దుకాణంలో విక్రయించిన మాంసాహార మోమోస్‌ను, వాటితోపాటు ఇచ్చిన మయోనైస్ చట్నీని రేష్మబేగం అనే మహిళ మరణించింది. ఆమె పిల్లలు రుమ్షా, రఫియా ఆస్పత్రి పాలయ్యారు. అల్వాల్‌లోని గ్రిల్ హౌజ్ హోటల్లో నాసిరకం మయోనైస్‌ను తిన్న కొందరు యువకులు ఇటీవల ఆస్పత్రి పాలయ్యారు.
వారం కిందట ఐదుగురు యువకులు వాంతులు, విరేచనాలతో స్థానిక ఆసుపత్రిలో చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి 10న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అదే హోటల్లో షవర్మ తిన్న 20 మందికిపైగా యువకులు 3, 4 రోజులయ్యాక ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది. కొంత మందికి రక్త పరీక్షలు చేయగా హానికర సాల్మనెల్లా బాక్టీరియా ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఆ హోటల్లోని షవర్మ బాగోలేదని బల్దియాకు ఫిర్యాదులు అందాయి. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్‌లోని ఓ హోటల్లో, టోలిచౌకి, చాంద్రాయణగుట్ట, కాటేదాన్, బంజారాహిల్స్‌లోని పలు హోటళ్లలోని షవర్మ, మండి బిర్యానీ, బర్గర్లపైనా బల్దియాకు వరుస ఫిర్యాదులు వచ్చాయి.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ హోటళ్లు, పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లలో జరిపిన తనిఖీల్లోనూ నాసిరకం మయోనైస్‌ను గుర్తించారు. ఉడికించని పదార్థమైనందున మయోనైస్‌లో హానికర బాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. మయోనైస్‌ను గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో తయారు చేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

