కీలక సేవల్లో ఆధార్ ధ్రువీకరణకు గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో పట్టణాభివృద్ధిశాఖకు సంబంధించి కీలకమైన సేవల్లో ఆధార్ ధ్రువీకరణ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ అనుమతితో పురపాలక, పట్టణాభివృద్ధి (ఎంఏయూడీ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం జీవోను విడుదల చేశారు.
- రాష్ట్ర పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పట్టణాభివృద్ధిశాఖకు సంబంధించి కీలకమైన సేవల్లో ఆధార్ ధ్రువీకరణ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ అనుమతితో పురపాలక, పట్టణాభివృద్ధి (ఎంఏయూడీ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం జీవోను విడుదల చేశారు. ఆన్లైన్ టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్, లాగిన్, అప్లికేషన్ల సమర్పణ కోసం ఆస్తి యజమానులు, బిల్డర్లు, డెవలపర్లు ఈ ఆధార్ ధ్రువీకరణను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
జీహెచ్ఎంసీ, పట్టణ ప్రణాళిక సంచాలకశాఖ అధికారుల అధికారిక లాగిన్ కోసం కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ ఆధార్ అథెంటికేషన్ అనేది పూర్తిగా స్వచ్ఛంద ప్రాతిపదికన ఉంటుందని స్పష్టంచేశారు. ఆధార్ ఇవ్వడానికి నిరాకరించినా లేదా కుదరకపోయినా సేవలను నిరాకరించకూడదని, ఆ సందర్భంలో పాస్‌పోర్ట్, ఓటర్ ఫొటో గుర్తింపుకార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డ్ లేదా ప్రభుత్వం జారీచేసిన ఇతర ఫొటో గుర్తింపు కార్డులను ప్రత్యామ్నాయంగా పరిగణించాలని ఆదేశాల్లో పేరొన్నారు. మోసాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు, దొంగచాటు కార్యకలాపాలను అరికట్టి రికార్డుల్లో పారదర్శకతను తీసుకురావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

