రైతుబీమా మాదిరి.. దళిత బీమా : సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ | దళిత బంధు పథకం లబ్ధిదారులకు దళిత బీమాను సైతం వర్తింపజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

హైదరాబాద్ : దళిత బంధు పథకం లబ్ధిదారులకు దళిత బీమాను సైతం వర్తింపజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రైతుబీమా మాదిరి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి దళిత బీమాను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, దళిత ప్రజాప్రతినిధులు, ఎస్సీ డెవలప్మెంట్ ఉన్నతాధికారులు దళిత బీమా కార్యాచరణపై కసరత్తు చేయాలని సీఎం సూచించారు. ఆమోదయోగ్యమైన కార్యాచరణ రూపొందించుకుని.. కొంచెం ఆలస్యమైనా దళిత బీమాను అమలు చేసుకుందామని అన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన దళిత బంధు పథకం అమలుపై హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళిత ప్రతినిధులతో ప్రగతి భవన్లో జరిగిన అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. దళితబంధు పథకం అమలు సందర్భంగా 3 దశలు పాటించాలని సూచించారు. దళితుల అసైన్డ్, గ్రామకంఠం సహా భూసమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పారు. దళితవాడల్లో మౌలిక వసతులు సంపూర్ణంగా మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

