4,250 కి.మీల సైక్లింగ్ పూర్తి.. ములుగు డీఎఫ్‌వోకు ఫైర్ డీజీ అభినందన
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగిన 4,250 కిలోమీటర్ల సైక్లింగ్ ఎక్స్ పెడిషన్ను విజయవంతంగా పూర్తి చేసిన ములుగు జిల్లా ఫైర్ ఆఫీసర్ ఏ నాగరాజును తెలంగాణ ఫైర్ డీజీ విక్రంసింగ్ మాన్ శనివారం సత్కరించారు.
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగిన 4,250 కిలోమీటర్ల సైక్లింగ్ ఎక్స్ పెడిషన్ను విజయవంతంగా పూర్తి చేసిన ములుగు జిల్లా ఫైర్ ఆఫీసర్ ఏ నాగరాజును తెలంగాణ ఫైర్ డీజీ విక్రంసింగ్ మాన్ శనివారం సత్కరించారు. ఈ సైక్లింగ్ రైడ్‌ను ఫిట్ ఇండియా మూవ్మెంట్లో భాగంగా యూత్ అండ్ స్పోర్ట్స్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ‘డేర్ టు గేర్’ సంస్థ నిర్వహించింది.
సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి 3,000కు పైగా దరఖాస్తులు రాగా.. 150 మందిని రైడ్‌కు ఎంపికచేశారు. ఆసియాలో అత్యంత కఠినమైన సైక్లింగ్ ఎక్స్ పెడిషన్స్లో ఇది ఒకటని.. జమ్ముకశ్మీర్, హర్యానా, పంజాబ్, న్యూఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మీదుగా ఈ రైడ్ సాగిందని విక్రంసింగ్ మాన్ తెలిపారు. డీఎఫ్‌వో నాగరాజు గతంలో అనేక మారథాన్ రన్నింగ్ ఈవెంట్స్, బీఆర్ఎం సైక్లింగ్ రైడ్స్‌లో పాల్గొన్నారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

