TG DSC | డీఎస్పీ అభ్యర్థులకు అలెర్ట్.. హాల్ టికెట్లు విడుదల..!
TG DSC | డీఎస్పీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ విద్యాశాఖ గురువారం రాత్రి విడుదల చేసింది. వైబ్సైట్లో హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్పీ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
TG DSC | డీఎస్పీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ విద్యాశాఖ గురువారం రాత్రి విడుదల చేసింది. వైబ్సైట్లో హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్పీ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. schooledu.telangana.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విధితమే. ఈ మేరకు విద్యాశాఖ మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. తాజాగా వెబ్సైట్లో హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి సీబీటీ బేస్డ్ టెస్ట్ నిర్వహించనుంది. సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్పీ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్ష కోసం 2,79,966 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తు వచ్చాయి. 11,062 ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఇదే..
18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష జరుగుతుంది.
18న సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ టెస్ట్ ఉంటుంది.
19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షను ప్రభుత్వం నిర్వహించనున్నది.
20న ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి.
22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష ఉంటుంది.
23న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు.
24న స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్ పరీక్ష జరుగుతుంది.
26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష ఉంటుంది.
30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష జరుగుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

