సీఎం దోచి పారేస్తున్నడు.. ముఖ్యమంత్రి శాఖలోనే వేల కోట్ల అవినీతి
‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చూస్తున్న శాఖలోనే రేడియల్ రోడ్లది అతి పెద్ద కుంభకోణం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్.. అన్నీ సీఎం శాఖకు సంబంధించినవే. సీఎం శాఖల పరిధిలోని జీహెచ్ఎంసీలోనే రూ.వేల కోట్లు దోపిడీ చేస్తే ఎలా? దొరికింది దొరికినట్టు దోచేస్తున్నరు.
- దొరికింది దొరికినట్టు దిగమింగుతున్నడు.. రేవంత్ తీరుతో తెలంగాణకు తీవ్ర నష్టం
- ముఖ్యమంత్రి అవినీతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన ఆరోపణలు
- ఆంధ్రా కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెడ్తున్నడు
- టెండర్లు వేయొద్దని సీఎంవో నుంచే చెప్తున్నరు
- కాదని వేస్తే మా కంపెనీని డిస్క్వాలిఫై చేశారు
- తక్కువ కోట్ టెండర్లు కాదని, ఎక్కువపై మక్కువ
- రాష్ట్రం కోసం అప్పులు తెచ్చి ఇట్లా దోచుకుంటరా?
- సింగరేణిని ఇట్లనే అవినీతిలో ముంచుతున్నరు
- ఈ దోపిడీపై రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేస్తా..
- రేడియల్ రోడ్లపై వదిలిపెట్ట! సుప్రీంకోర్టుకూ వెళ్తా
తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు మిగిలించేలా తక్కువ రేటుకు టెండర్లు వేస్తే నచ్చదు. ఎక్కువ రేటుకు వేసే వాడే కావాలి. వాళ్ల ద్వారా పైసలు సంపాదించుకోవాలి. తెలంగాణ ప్రజల సొమ్మును లూటీ చేయాలి. ఇది దుర్మార్గమైన ఆలోచన. కాంగ్రెస్ ఎమ్మెల్యేనైన నా కంపెనీనే తక్కువ రేటుకు టెండర్ వేస్తే డిస్క్వాలిఫై చేస్తారు. ఎక్కువ రేటుకు టెండర్లు వేసిన ఆంధ్రా కాంట్రాక్టర్ల కంపెనీలకు కట్టబెడుతారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అప్పుగా తెచ్చిన సొమ్మును ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం కంటే దుర్మార్గం ఇంకేముంటుంది? మూడేండ్లుగా రేవంత్ ప్రభుత్వం ఇట్లనే చేస్తున్నది.
– కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చూస్తున్న శాఖలోనే రేడియల్ రోడ్లది అతి పెద్ద కుంభకోణం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్.. అన్నీ సీఎం శాఖకు సంబంధించినవే. సీఎం శాఖల పరిధిలోని జీహెచ్ఎంసీలోనే రూ.వేల కోట్లు దోపిడీ చేస్తే ఎలా? దొరికింది దొరికినట్టు దోచేస్తున్నరు. సీఎం రేవంత్ తీరు తెలంగాణ ప్రజలకు చాలా నష్టం..’ అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఓ యూట్యూబ్ చానల్‌తో ఫోన్లో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం మొదలు అన్ని స్థాయిల నేతలపై వస్తున్న అవినీతి ఆరోపణలకు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఆయ న ఇన్నాళ్లూ ప్రభుత్వం తీరును తప్పుబట్టినా.. నేరుగా సీఎం రేవంత్‌రెడ్డినే లక్ష్యంగా చేసుకొని అవినీతి ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి.
దీంతో అధికార పార్టీలో, రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. టెండర్లలో భారీగా గోల్మాల్ జరుగుతున్నదని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ‘తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు మిగిలించేలా తక్కువ రేట్‌కు టెండర్లు వేస్తే నచ్చదు. ఎక్కువ రేట్‌కు వేసే వాడే కావాలి. వాళ్ల ద్వారా పైసలు సంపాదించుకోవాలి, తెలంగాణ ప్రజల సొమ్మును లూటీ చేయాలి. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం కూడా. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనైన నా కంపెనీనే తక్కువ రేటుకు వేస్తే డిస్క్వాలిఫై చేస్తారు. ఎక్కువ రేట్‌కు టెండర్లు వేసిన ఆంధ్రా కాంట్రాక్టర్ల కంపెనీలకు కట్టబెడుతారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అప్పుగా తెచ్చిన సొమ్మును ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం కంటే దుర్మార్గం ఇంకేముంటుంది? మూడేండ్ల నుంచి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా ఇట్లనే చేస్తున్నది’ అని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బిల్లులు ఇవ్వమంటే మాత్రం డబ్బులు ఉండవని, ప్రభుత్వం అప్పు తెచ్చిన డబ్బులను రేడియల్ రోడ్ల పేరుతో ఎక్కువ రేట్లకు కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ‘ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను. అయినా సరే ఇట్లా దుర్మార్గం చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
మాకిస్తే రూ.650 కోట్లు మిగిలేవి
తాము వేసిన టెండర్‌తో ప్రభుత్వానికి రూ.650 కోట్లు మిగిలేవని రాజగోపాల్‌రెడ్డి తేల్చిచెప్పారు. ‘బద్వేల్ నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్డులో మూడు ప్యాకేజీలకు కలిపి మా కొడుకు నిర్వహిస్తున సుశీ హైటెక్ సంస్థ ద్వారా రూ.650 కోట్ల తక్కువకు టెండర్ వేశాం. మాది ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. మేము వేసిన టెండర్లో చిన్న కౌంటర్ సైన్ లేదని రాత్రికి రాత్రి డిస్ క్వాలిఫై చేశారు. కేంద్రంలో కౌంటర్ సైన్ సిస్టమ్ ఉండదు. అయినా సరే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ విభాగంలోని రీజినల్ ఆఫీసు నుంచే ఎస్ ఈ తరఫున కౌంటర్ సైన్ పత్రం సమర్పించాం. కానీ దాన్ని పట్టించుకోకుండా డిస్క్వాలిఫై చేస్తామన్నారు. దానికి కూడా మేము వెంటనే స్పందించి వాళ్లు అడిగిన సర్టిఫికెట్ కూ డా తెచ్చి ఇచ్చాం. అయినా సరే తెల్లారేసరికే మా కంపెనీని కావాలనే డిస్క్వాలిఫై చేశారు. ఆంధ్రా కంపెనీలైన నాగార్జున కన్స్ట్రక్షన్స్, బీవీఎస్ఆర్, జీకేసీలకు ఎక్కువ రేటుకు కాంట్రాక్టు అప్పజెప్పారు.
దీనివల్ల తెలంగాణ ప్రజల సొమ్ము రూ.650 కోట్లు ఆంధ్రా కంపెనీలకు దోచిపెడుతున్నట్టే. ఇదే టెండర్ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు మా సంస్థకు దక్కి ఉంటే రాష్ర్టానికి రూ.650 కోట్లు మిగిలేవి’ అని వివరించారు. తమ కంపెనీ తొమ్మిది రాష్ర్టాల్లో కాంట్రాక్టులు చేస్తున్నదని చెప్పారు. దేశంలోనే ఎవరూ చేయని విధంగా అరుణాచల్‌ప్రదేశ్‌లో 252 కిలోమీటర్ల రోడ్డు పనులను పూర్తిచేశామని పేర్కొన్నారు. చైనా సరిహద్దులో, పర్వతాల మధ్య మన దేశ సైన్యం కోసం ఈ రోడ్డు నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేశామని, పేరున్న కంపెనీలు కూడా వాటిని చేయలేకపోయాయని చెప్పారు. ఇలా తమ కంపెనీకి ఉన్న అనుభవం దేశంలో మరెవరికీ లేదని స్పష్టంచేశారు. ‘మా కంపెనీ బద్వేల్ నుంచి కొడంగల్ రేడియల్ రోడ్డు వర్క్‌ను కండ్లు మూసుకుని చేయగలదు. మేము 20శాతం లెస్‌కు టెండర్ కోట్ చేశాం. కానీ మాకివ్వకుండా ప్రజల సొమ్ము ను, రాష్ట్రం కోసం అప్పు తెచ్చిన డబ్బును ఇట్లా ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం చాలా తప్పు. ఇది చాలా దుర్మార్గం’ అని దుయ్యబట్టారు.
‘వద్దు’ అని సీఎం ఆఫీస్ నుంచే ఆదేశాలు
పనులకు ఎవరెవరు టెండర్లు వేయాలో? ఎవరు వేయొద్దో? సీఎం ఆఫీస్ నుంచే చెప్తున్నారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. రెండేండ్ల క్రితం రేడియల్ రోడ్ల టెండర్లలో పాల్గొనవద్దని తమ కంపెనీకి చెప్పారని తెలిపారు. తమకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈసారి కూడా వేరేవాళ్లు టెండర్లు వేయవద్దని సీఎం ఆఫీస్ నుంచి ముందే అందరికీ చెప్పారని తెలిపారు. ‘మాకు కూడా చెప్పారు. కానీ అన్ని అర్హతలున్న మేమెందుకు ఆగాలి? తెలంగాణ కంపెనీని ఆపడానికి వాళ్లెవరు? వాళ్లని కాదని టెండర్లు వేస్తే డిస్క్వాలిఫై చేస్తారా?’ అని ప్రశ్నించారు. ‘అన్ని అర్హతలు ఉన్న మాకు ఎక్కడైనా టెండర్ వేసుకునే హక్కు ఉన్నది. మేము దేశవ్యాప్తంగా కాంపిటీషన్లోనే టెండర్లు వేసి దక్కించుకుంటాం.
అన్ని అర్హతలున్న మాకు ఏ సీఎంతోనూ, ఏ ప్రభుత్వంతోనూ పని లేదు. మా కంపెనీకి అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, జార్ఖండ్, మేఘాలయ, మహారాష్ట్ర ఇలా తొమ్మిది రా ష్ర్టాల్లో పనులు చేసిన అనుభవం ఉన్నది. అదేవిధంగా సొంత రాష్ట్రం తెలంగాణలోనూ టెండర్లు వేశాం. కాకపోతే ఇక్కడ వాళ్లకు ఇష్టం లేనందునే డిస్క్వాలిఫై చేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా బద్వేల్-కొడంగల్ రేడియల్ రోడ్డులో ప్రైస్‌బిడ్ ఓపెన్ చేసి రూ.650 కోట్లు ప్రభుత్వానికి మిగిలించాల్సిందేనని డిమాండ్ చేశారు. న్యాయం కోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించామని వెల్లడించారు. వాళ్లు తప్పు చేశారు కాబట్టే.. రూ.ఐదు కోట్లు పెట్టి ముకుల్ రోష్ని వంటి బలమైన లాయర్‌ను పెట్టుకున్నారని చెప్పారు. ధర్మం తమ వైపు ఉన్నదని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామని స్పష్టంచేశారు. ‘నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను, కాంగ్రెస్‌లో ఉంటూనే ఇట్లాంటి దోపిడీపై ప్రశ్నిస్తా. ఇది మంచి పద్ధతి కాదని రాహుల్‌గాంధీకి కూడా చెప్తా’ అని హెచ్చరించారు.
మూతపడే స్థితిలో సింగరేణి
‘సింగరేణి కూడా మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. ప్రభుత్వ పెద్దల రూ. వేల కోట్ల అవినీతితో సంస్థ మూతపడేలా ఉన్నది’ అని రాజగోపాల్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. దొరికింది దొరికినట్టే దోచుకుంటున్నారని, విపరీతమైన అవినీతి చేస్తున్నారని, దీన్ని నిర్మూలించకపోతే రాష్ట్రం అప్పుల్లోంచి బయటకు రాదని స్పష్టంచేశారు. ‘పైస్థాయిలో ఇలా లక్షల కోట్లు దోచుకుంటే ఉద్యోగుల జీతాలకు, పెన్షనర్ల నగదు చెల్లింపులకు ఇబ్బందులు తప్పవు’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, ప్ర భుత్వ బడులు లేవు, ఆసుపత్రులు సరిగా లేవు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లే దు.. ఇట్లా చేయాల్సినవి చాలా ఉన్నాయని వివరించారు. ‘ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి తప్ప.. ఇలా దోచుకోవడమే లక్ష్యమైతే ఎలా?’ అని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

