CM Revanth | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ
CM Revanth | దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చించారు.
CM Revanth | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చించారు.
తెలంగాణలోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ – శ్రీశైలం ఫోర్ లైన్ ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ – కల్వకుర్తి రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయడం, రీజినల్ రింగ్ రోడ్డు (RRR)దక్షిణ భాగం అభివృద్ధి, హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించడంపై గడ్కరీతో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చించారు. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF) నుండి తెలంగాణకు నిధుల కేటాయింపు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
నల్గొండలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని, నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
Caste Census | కులగణనపై అనుమానాలెన్నో.. దేశవ్యాప్తంగా నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితి
Evening Court | ఈవెనింగ్ కోర్టులు వద్దు.. హైకోర్టు యాక్టింగ్ సీజేకి బార్ అసోసియేషన్ల సమాఖ్య వినతి
RTC Merger | అటకెక్కిన ఆర్టీసీ విలీనం.. మూడేండ్లు కావొస్తున్నా నెరవేరని హామీ!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

