సిబ్బందిలో కొత్త ఉత్సాహం

- సీఎం సందర్శన మనోనిబ్బరాన్ని నింపింది
- వెంటిలేటర్‌పై ఉన్న రోగికూడా లేచి మాట్లాడాడు
- గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ దవాఖాన సందర్శన వైద్యులు, సిబ్బందిలో మనో నిబ్బరాన్ని, రోగుల్లో భరోసాను నింపిందని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. సీఎం వస్తున్నారనగానే వైద్య సిబ్బందిలో కొత్త ఉత్తేజం కనిపించిందని చెప్పారు. అందరూ సంతోషం వ్యక్తంచేశారని, ఇక రోగుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని పేర్కొన్నారు. జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన ఘటనగా వారు ఫీలయ్యారని.. ఒక సీఎం వచ్చి ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్న రోగి యోగక్షేమాలు అడగడం నిజంగా ఊహించనిదని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను చూడగానే సీ-టాప్ వెంటిలెటర్‌పై ఉన్న పేషెంట్లు కూడా గుర్తుపట్టడం, వారంతట వారే లేచి మాట్లాడటం.. చేతులెత్తి నమస్కరించడం చాలా ఆశ్చర్యమేసిందని అన్నారు. సాధారణంగా వెంటిలేటర్‌పై ఉన్న పేషెంట్స్ లేవలేరని, సీఎంను చూడగానే ఎైగ్జెట్‌మెంట్‌కు గురైనవారు చాలా ఆనందించారని తెలిపారు. సీఎం కేసీఆర్ దవాఖానలోని ఎమర్జెన్సీ, జనరల్ వార్డులన్నీ కలియతిరిగారు. వైద్యసిబ్బంది, నర్సులు, స్వీపర్లు, ఇలా ప్రతిఒక్కరితోనూ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని, దానికి సంబంధించిన పూర్తివివరాలను అందజేయాలని సూచించారని తెలిపారు. రెండ్రోజుల్లో వివరాలను సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తానని డాక్టర్ రాజారావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

