యాంజియోగ్రామ్ కన్నా ఐవస్ మేలు

- గుండె బ్లాకులను సులభంగా గుర్తించే సాంకేతికత
- కార్డియాలజిస్టు బాలాజీ వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 3 (నమస్తే తెలంగాణ): యాంజియోగ్రామ్‌తో గుర్తించలేని 30 శాతంలోపు తీవ్రత కలిగిన చిన్న బ్లాకులను ఇంట్రావ్యాస్కులర్ అల్ట్రా సౌండ్-ఓసీటీ (ఐవస్-ఓసీటీ) ద్వారా సులభంగా గుర్తించవచ్చునని మెడికవర్ హాస్పిటల్ కార్డియాలజిస్టు డాక్టర్ బాలాజీ తెలిపారు. సీఎస్ఐ సదస్సు సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ, అన్నిరకాల చిన్నపాటి బ్లాక్‌ల వల్ల గుండెపోటు రాదని, కొన్నిరకాల చిన్నపాటి బ్లాక్‌లు గుండెపోటుకు దారితీస్తాయని చెప్పారు. ఈ ‘వల్నరబుల్’ బ్లాక్‌లను యాంజియోగ్రామ్‌లు గుర్తించకపోవడంతో రోగి అకస్మాతుగా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఈ ముప్పును అధిగమించడంలో ఐవస్-ఓసీటీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. 1 ఎం.ఎం. పరిమాణం గల చిన్నపాటి ఐవస్ యంత్రాన్ని రక్తనాళాల్లోకి పంపించి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ పరికరంలో చిన్నపాటి కెమెరా ఉండడం వల్ల రక్తనాళాలను స్పష్టంగా చూస్తూ గుండెపోటుకు దారితీసే బ్లాక్‌లను ముందుగానే గుర్తించవచ్చునని, రోగిని అప్రమత్తం చేయడంతో పాటు ముందస్తు చికిత్స ప్రారంభించవచ్చునని డాక్టర్ బాలాజీ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

